Share News

ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ క్షమాపణ చెప్పాలి

ABN , Publish Date - Nov 08 , 2024 | 12:30 AM

నేతకాని కులం గురించి మాట్లాడిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ వెంకటస్వామి క్షమాపణ చెప్పాలని తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం మారుతి డిమాండ్‌ చేశారు. గురువారం నగరంలోని ప్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేతకాని కులాన్ని మాలనేతగా మార్చాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ మాట్లాడడాన్ని మీడియాలో చూశామన్నారు. ఇది తమను ఎంతో బాధించిందన్నారు.

ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ క్షమాపణ చెప్పాలి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న దుర్గం మారుతి

సుభాష్‌నగర్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): నేతకాని కులం గురించి మాట్లాడిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ వెంకటస్వామి క్షమాపణ చెప్పాలని తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం మారుతి డిమాండ్‌ చేశారు. గురువారం నగరంలోని ప్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేతకాని కులాన్ని మాలనేతగా మార్చాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ మాట్లాడడాన్ని మీడియాలో చూశామన్నారు. ఇది తమను ఎంతో బాధించిందన్నారు. రాష్ట్రంలోని నేతకాని కులస్థులు ఇంతవరకు ఏ కులాన్ని గురించి మాట్లాడలేదన్నారు. తమది ప్రత్యేక కులం అని, సీరియల్‌ నంబరు 40గా ఉందని, తమ కులం ఉనికికి ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో నేతకాని కులస్థులు 15 లక్షల వరకు ఉంటారని, తమ కులానికి చెందిన వారు గోదావరి పరివాహక ప్రాంతాల్లో నివసించే వారమని, తమకు భూమి హక్కులు కల్పించేలా చూడాలని కోరారు. తమ ఉనికికి, హక్కులకు భంగం కలిగితే తాము న్యాయస్థానానికి వెళ్తామన్నారు. తమను నేతకాని కులస్తులుగానే ఉంచాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కోశాధికారి జాడి రాజు, గోదారి చంద్రయ్య, గోల్లే రమేశ్‌, జాడి కనకయ్య, గోల్లె లక్ష్మణ్‌, జాడి కొమురయ్య, బండారి లక్ష్మణ్‌, గోదారి సంపత్‌, జాడి రాజు, గోదారి బాలకిషన్‌, బండారి ఆంజనేయులు, జాడి ఎల్లయ్య, అనిల్‌, బండారి గోపి పాల్గొన్నారు.

Updated Date - Nov 08 , 2024 | 12:30 AM