Share News

గర్రెపల్లి మండలం ఏర్పాటుపై కదలిక..

ABN , Publish Date - Dec 30 , 2024 | 12:34 AM

సుల్తానాబాద్‌ మండలంలోని గర్రెపల్లిని మండలంగా ఏర్పాటు చేసే విషయమై కదలిక వచ్చింది.

గర్రెపల్లి మండలం ఏర్పాటుపై కదలిక..

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

సుల్తానాబాద్‌ మండలంలోని గర్రెపల్లిని మండలంగా ఏర్పాటు చేసే విషయమై కదలిక వచ్చింది. ఈనెల 26వ తేదీన ఆంధ్రజ్యోతి జిల్లా ఎడిషనల్‌లో ‘తెరపైకి గుంజ పడుగు మండలం’.. గర్రెపల్లిపై ఊసెత్తని అధికారులు అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు స్పందించారు. గర్రెపల్లి మండలం ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయా లని కలెక్టర్‌ను కోరడంతో ఈ మేరకు గర్రెపల్లి చుట్టు పక్కలా గ్రామాలను కలుపుతూ మండలం ఏర్పాటు కోసం నివేదికను అధికారులు రూపొందిస్తున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, సర్వే ల్యాండ్స్‌, జిల్లా పరిషత్‌ అదికారులు మ్యాపింగ్‌ చేస్తున్నారు. గర్రెపల్లి, భూపతి పూర్‌, ఐతరాజుపల్లి, దుబ్బపల్లి, నారాయణ రావుపల్లి, సాంబయ్యపల్లి, గొల్లపల్లి, బొంతకుంటపల్లె, నర్సయ్య పల్లె గ్రామాలతో కలిపి గర్రెపల్లి మండలంగా ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుత సుల్తా నాబాద్‌ మండలంలో మొత్తం 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో నుంచి 9 పంచాయతీలతో కలుపు కుని గర్రెపల్లి మండలాన్ని ఏర్పాటు చేయనున్నారు. పెద్దపల్లి జిల్లా ఏర్పాటైన సమయంలోనే గుంజపడు గుతో పాటు గర్రెపల్లి మండలాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఉంది. కానీ అప్పుడు కేవలం మూడు అంతర్గాం, పాలకుర్తి, రామగిరిలను కొత్త మండలాలుగా ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినప్పటికీ మండ లాలు ఏర్పాటు చేయలేదు. మరో రెండు, మూడు మాసాల్లో గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఏవైనా కొత్తగా గ్రామ పంచా యతీలు గానీ, మండలాలను ఏర్పాటు చేయాలంటే ఇదే సమయం., ఎన్నికలు పూర్తయిన తర్వాత కొత్త పంచా యతీలు, మండలాలను ఏర్పాటు చేయడం పాలన పరంగా ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త పంచాయతీలతో పాటు గుంజపడుగు, గర్రెపల్లి మండలాలను ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి.

రాజీవ్‌ రహదారి పక్కనే..

గర్రెపల్లి గ్రామం రాజీవ్‌ రహదారిని ఆనుకుని ఉండ డం వల్ల మండలంగా ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉంటుంది. ఇక్కడ మండల పరిషత్‌, తహసీల్దార్‌, మండల విద్యా వనరుల కేంద్రం, మండల వ్యవసాయ, తదితర కార్యాలయాల కాంప్లెక్సును ఒకే చోట నిర్మించేం దుకు అనువైన స్థలం ఉంది. ఈ గ్రామంలో సర్వే నంబ ర్లు 1603, 1614, 1643, 1645లలో సుమారు 50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఇక్కడ ఇప్పటికే సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాలతో పాటు ఆదర్శ పాఠశాల, కస్తూర్భాగాంధీ బాలికల గురు కుల విద్యాలయం, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశు వుల దవాఖాన, జిల్లా లోనే అతి పెద్ద చెరు వు, దీని పరిసరాల్లో ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, ఎంబీఏ, తదితర కళాశాలలు ఉన్నాయి. అలాగే విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, అన్ని రకాల వస తులు ఉన్నాయి. అన్ని రకాల వసతులున్న దృష్ట్యా గర్రెపల్లిని మండ లంగా ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సైతం గర్రెపల్లిని మండలంగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం అవుతు న్నాయి. ఈనెల 30వ తేదీన ప్రభుత్వానికి జిల్లా అధికా రులు ప్రతిపాదనల ఫైల్‌ను పంపించాలని నిర్ణయిం చారు. కొత్తగా ప్రతిపాదిస్తున్న గుంజపడుగు, గర్రెపల్లి మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే జిల్లాలో మండ లాల సంఖ్య 16కు చేరుకోనున్నది. కాగా, ఈ విషయమై కలెక్టర్‌ కోయ శ్రీహర్షను ఫోన్‌లో ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా గర్రెపల్లిని మండ లంగా ఏర్పాటు చేసే విషయమై చుట్టుపక్కల గ్రామా లను కలుపుకుని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సోమవారం ప్రభుత్వానికి ఫైల్‌ను పంపిస్తు న్నామని కలెక్టర్‌ పేర్కొన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 12:34 AM