Share News

మల్టీపర్పస్‌ విధానాన్ని రద్దు చేయాలి

ABN , Publish Date - Dec 28 , 2024 | 12:20 AM

గ్రామపంచాయతీల్లో అమలు చేస్తు న్న మల్టీనర్పస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్య దర్శి జి.జ్యోతి డిమాండ్‌ చేశారు.

మల్టీపర్పస్‌ విధానాన్ని రద్దు చేయాలి

పెద్దపల్లి రూరల్‌, డిసెంబరు 27 (ఆంధ్ర జ్యోతి) : గ్రామపంచాయతీల్లో అమలు చేస్తు న్న మల్టీ పర్పస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్య దర్శి జి.జ్యోతి డిమాండ్‌ చేశారు. గ్రామ పం చాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట చేపట్టిన సమ్మె శిబిరాన్ని జి.జ్యోతి ప్రారంభిం చారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామపంచాయతీ సిబ్బంది బకాయి వేతనా లు వెంటనే చెల్లించాలన్నారు. వేతనాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలని, గ్రీన్‌ఛానల్‌ ద్వారా వేతనాలు చెల్లించాలన్నా రు. రెండవ పీఆర్సీ పరిధిలోకి గ్రామపంచా యతీ సిబ్బందిని తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. జీవో నంబర్‌ 51ని సవరించి, మల్టీప ర్పస్‌ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల గౌరవాధ్యక్షుడు దొం త కనకయ్య, మండల అధ్యక్షుడు మామిడి పల్లి తిరుపతి, మండల ప్రధాన కార్యదర్శి జంగపల్లి నరేష్‌, కోశాధికారి బందరి అశోక్‌, ముస్తఫా, నరస య్య, నాగరాజు, శ్రీనివాస్‌, శంకరమ్మ, స్వప్న, మల్లమ్మ, లక్ష్మి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 12:20 AM