Share News

జాతీయ రహదారి పనులు ముమ్మరం

ABN , Publish Date - Oct 24 , 2024 | 01:22 AM

కరీంనగర్‌-వరంగల్‌ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-563) నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం భారత మాల యోజన కింద 2,146 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 68కిలో మీటర్ల మేరకు ఫోర్‌లైన్‌ రోడ్డు నిర్మిస్తోంది. ఇందుకు 325.125 హెక్టార్ల భూసేకరణ పూర్తి చేసింది. కరీంనగర్‌ మండలం ఇరుకుల్ల, దుర్శేడ్‌ శివారులో బొమ్మకల్‌ మానేరు వాగు మీదుగా మానకొండూర్‌ వరకు రహదారి పనులు విస్తరంగా జరుగుతున్నాయి.

జాతీయ రహదారి పనులు ముమ్మరం
ఇరుకుల్ల వద్ద ఏర్పాటు చేసిన దారి

- మానేరు వాగుపై తుదిదశకు వంతెన పనులు

- ఇరుకుల్ల వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణం పనులు షురూ

-దారి మళ్లించేందకు రహదారి ఏర్పాటు

కరీంనగర్‌ రూరల్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌-వరంగల్‌ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-563) నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం భారత మాల యోజన కింద 2,146 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 68కిలో మీటర్ల మేరకు ఫోర్‌లైన్‌ రోడ్డు నిర్మిస్తోంది. ఇందుకు 325.125 హెక్టార్ల భూసేకరణ పూర్తి చేసింది. కరీంనగర్‌ మండలం ఇరుకుల్ల, దుర్శేడ్‌ శివారులో బొమ్మకల్‌ మానేరు వాగు మీదుగా మానకొండూర్‌ వరకు రహదారి పనులు విస్తరంగా జరుగుతున్నాయి. రోడ్డు నిర్మాణ పనుల్లో బాగంగా మొత్తం 28 వెహికిల్‌ అండర్‌ పాస్‌ బ్రిడ్జిలు, ఇరుకుల్ల, మానేరు తదితర వాగులపై మొత్తం తొమ్మిది మేజర్‌ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. బొమ్మకల్‌ మానేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఇరుకుల్ల వాగుపై 250 మీటర్లు, మానేరు వాగుపై 562 మీటర్ల పొడవుతో వంతెనలు నిర్మిస్తున్నారు. ఇరుకుల్ల గ్రామ ప్రధాన రహదారిపై ఫైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు చేస్తున్నారు. వాహనాలను మళ్లించేందుకు తారు రోడ్డును సిద్ధం చేస్తున్నారు.

ఫ భూ సేకరణ పూర్తయినా.. అందని పరిహారం

జాతీయ రహదారి నిర్మాణానికి రెండు సంవత్సరాల క్రితమే అధికారులు భూసేకరణ చేపట్టారు. పనులు జరుగుతున్నా నష్టపరిహారం అందించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్‌ మండలంలో భూసేకరణ చేసిన గ్రామాల్లో దుర్శేడ్‌, ఇరుకుల్ల, ఎలబోతారం, నగునూర్‌, జూబ్లీనగర్‌ గ్రామాల రైతులకు సంబంధించిన వ్యవసాయ భూములను సేకరించారు. ఇరుకుల్లలో పూర్తి స్థాయిలో పరిహారం అందించినప్పటికి రహదారి నిర్మాణంలో భభాగంగా కోల్పోయిన బావులకు ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు. ఎలబోతారం, నగునూర్‌, జూబ్లీనగర్‌ గ్రామాల్లో కొంత మంది నుంచి 15 రోజుల క్రితం సంతకాలు సేకరించిన అధికారులు ఇప్పటికీ డబ్బులు వేయలేదు. ప్రస్తుతం ఇరుకుల్ల నుంచి ఎలబోతారం, జూబ్లీనగర్‌కు రహదారి పనులు ప్రారంభం అవుతున్నాయి. పూర్తిస్థాయిలో నష్ట పరిహారం చెల్లించిన తరువాతే పనులు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Oct 24 , 2024 | 01:22 AM