ఏడాదిలో నియోజకవర్గానికి రూ.వెయ్యి కోట్ల నిధులు
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:26 AM
రాష్ట్రంలో అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే పెద్దపల్లి నియోజ కవర్గానికి వివిధ అభివృద్ధి పనుల కోసం సుమారు వెయ్యి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు తెలిపారు.
పెద్దపల్లిటౌన్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే పెద్దపల్లి నియోజ కవర్గానికి వివిధ అభివృద్ధి పనుల కోసం సుమారు వెయ్యి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు తెలిపారు. శుక్రవారం పెద్దపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెద్దపల్లి ప్రజల చిరకాల స్వప్నం పెద్దపల్లిలో ఆర్టీసీ బస్‌డిపో మంజూరు చేయిం చానని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాకు వర ప్రదాయినిగా నిలవబోయే పత్తిపాక రిజర్వాయర్ డీపీఆర్ పనుల కోసం ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న నాలుగేళ్ల లోపు పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేసి పెద్ద పల్లి జిల్లాలోని చివరి ఆయకట్టు భూములకు సాగు నీరందిస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్, ధర్మపురి, చొప్పదండి, రామగుండం, పెద్దపల్లి, మంథనినియోజక వర్గాల్లో 2లక్షల 40 వేల ఎకరాలు పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే సస్య శ్యామలమవుతాయన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 2లక్షల వరకు రుణమాఫీ 80 శాతం మందికి ఇప్పటికే ఖాతాల్లో జమ చేసినట్లు వివ రించారు. నియోజకవర్గంలో 3వేల 5వందల మంది సీఎం ఆర్‌ఎఫ్ దరఖాస్తు చేసుకోగా, 2వేల మందికి పైగా రూ.9కోట్ల 50లక్షల రూపాయలను మంజూరుచేసినట్లు, 140 మందికి వివిధ ఆస్పత్రుల్లో వైద్య ఖర్చుల కోసం ఎల్‌వోసీలు ఇప్పించామన్నారు. 1309మందికి కళ్యాణలక్ష్మి పథకం ద్వారా13 కోట్ల పది లక్షల రూపాయలు అందిం చినట్లు వివరించారు. 33వేల 706 మంది రైతులకు 243 కోట్ల రుణ మాఫీ చేశామన్నారు. 209 మంది రైతులకు 10కోట్ల95లక్షల రూపాయలు రైతు బీమా అందించామ న్నారు. 10వేల 488 మంది రైతులకు బోనస్ క్వింటాల్‌కు 500 రూపాయల చొప్పున 35కోట్ల 33లక్షల సన్నవడ్లకు బోనస్ రూపంలో చెల్లించామన్నారు. 10వేల 488 మంది పేద విద్యార్థులకు గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలు కల్పించామని తెలిపారు. పత్తిపాక రిజర్వాయర్‌పై గతం లో పదేళ్లు పాలించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం జూటా మాటలు చెప్పి రైతులను మోసం చేసిందన్నారు. గొప్పలు చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పెద్దపల్లికి చుక్క నీరైనా సాగు నీరందించారా.. ప్రజలకు సమాధానం చెప్పాలని బీఆర్ ఎస్ నాయకులను డిమాండ్ చేశారు. వసతి గృహాల్లోని విద్యార్థులకు 40 శాతం మెస్ ఛార్జీలను పెంచామన్నా రు. నిరుద్యోగులకు భరోసా కల్పిస్తూ.. ఉద్యోగాలు కల్పించామని,ఏడాది కాలం లో 61వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ సర్కా రుకే దక్కిందన్నారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు, ఇళ్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. ఈనెల 4 న యువవికాసం సభ విజయంలో పాలుపంచుకున్న జిల్లా, నియోజకవర్గ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజలకు, ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావే శంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, మార్కెట్ చైర్మన్లు ఈర్ల స్వరూప, ప్రకాశ్‌రావు, కాంగ్రెస్ నాయకులు బుషనవేని సురేశ్ గౌడ్, గోపగాని సారయ్య గౌడ్, బండారి రామ్మూర్తి, నూగిళ్ల మల్లయ్య, సందనవేని రాజేందర్ యాదవ్, మస్రత్, బొడ్డుపల్లి శ్రీనివాస్, భూత గడ్డ సంపత్, సింగిల్‌విండో చైర్మన్లు సంపత్, నర్సింహా రెడ్డి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.