ఓసీపీ-3లో నల్లబ్యాడ్జీలతో ఆపరేటర్ల నిరసన
ABN , Publish Date - Nov 20 , 2024 | 12:37 AM
ప్రమోషన్లు ఇవ్వడంలో యాజమాన్యం జాప్యం చేయడా న్ని నిరసిస్తూ మంగళవారం ఓసీపీ-3లో ఆపరేటర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగారు.
యైుటింక్లయిన్‌కాలనీ, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): ప్రమోషన్లు ఇవ్వడంలో యాజమాన్యం జాప్యం చేయడా న్ని నిరసిస్తూ మంగళవారం ఓసీపీ-3లో ఆపరేటర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగారు. డీ గ్రేడ్ ఆపరేటర్లమైన తమకు 2021లో సీ గ్రేడ్ ఆపరేటర్లుగా ప్రమోషన్లు రావా ల్సి ఉన్నదని, నాలుగేళ్ళుగా ప్రమోషన్లు ఇవ్వకపోవడంతో అన్ని విధాల నష్టపోతున్నట్టు ఆపరేటర్లు తెలిపారు. అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. తమ తర్వాత ఆపరేటర్లుగా రిక్రూట్ అయిన ఆపరేటర్లు సీ గ్రేడ్ పదోన్నతి లభించినా, రామగుండం రీజియన్ ఆపరేటర్లకు మాత్రం ఇప్పటి వరకు ప్రమోష న్లు ఇవ్వలేదని అన్నారు. సింగరేణి చరిత్రలో ఏళ్ళ తరబడి ప్రమోషన్ల ఆలస్యం జరిగిన దాఖలాలు లేవన్నారు. గతం లో ప్రమోషన్లు ఆలయమయిన సందర్భాల్లో బ్యాక్ డేట్‌తో ప్రమో షన్లు ఇచ్చిన ఆనవాయితీ ఉన్నదని ఆపరేటర్లు పేర్కొన్నారు. డీ గ్రేడ్ ఆపరేటర్లక సీ గ్రేడ్ ప్రమోషన్లు ఇప్పించడంలో గుర్తింపు సంఘం చొరవ చూపాలని కోరారు. ఈనెలలో జరగనున్న స్ట్రక్చర్ సమావేశా ల్లో 2021 నాటిని పరిగణనలోకి తీసుకుని సీ గ్రేడ్ ప్రమోషన్లు ఇవ్వా లని డిమాండ్ చేశారు. ఈనిరసనలో మల్లేష్, తిరుపతిరెడ్డి, గుర్రం రవి, సదానందం, విజయ్‌కుమార్, రాకం రమేష్, శ్రీహరి, రాజశేఖ ర్‌రెడ్డి, మహిపతి, రమేష్, మల్లేష్, రామకృష్ణ పాల్గొన్నారు.