Share News

ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పోలీస్‌ సేవలు

ABN , Publish Date - Dec 24 , 2024 | 12:53 AM

ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో సేవలందిస్తున్నామని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. గంభీరావుపేట మండలం లింగన్నపేట తండాలో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.

ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పోలీస్‌ సేవలు
వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

గంభీరావుపేట, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో సేవలందిస్తున్నామని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. గంభీరావుపేట మండలం లింగన్నపేట తండాలో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకే గ్రామాల్లో ఉచితంగా వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు పోలీస్‌ సేవలను మరింత చేరువ చేయడానికి కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. పోలీస్‌లు ఉన్నది ప్రజల భద్రత కోసమేనన్నారు. గతంలో వీర్నపల్లి, రుద్రంగి తదితర మండలాల్లో వైద్య శిబిరాలు నిర్వహించామని, యువతకు స్పోర్ట్స్‌ కిట్స్‌ అందజేశామని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలను చదివించాలని, ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, చెడు వ్యసనాలకు బానిసలైతే వివరాలను అందించాలని అన్నారు. వైద్యులతో కౌన్సిలింగ్‌ నిర్వహిస్తామని, సన్మార్గంలో నడిచే విధంగా తీర్చిదిద్దవచ్చని అన్నారు. వైద్య శిబిరానికి సహకరించిన ఎల్లారెడ్డిపేట అశ్విని ఆసుపత్రి వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వైద్యశిబిరంలో దాదాపు 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్‌గౌడ్‌, ఎస్సైలు శ్రీకాంత్‌, ఎల్లాగౌడ్‌, ఏఎస్సై శ్రీనివాస్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 12:53 AM