ర్యాగింగ్, టీజింగ్‌లపై పోస్టర్ ఆవిష్కరణ
ABN , Publish Date - Nov 08 , 2024 | 12:24 AM
ర్యాగింగ్, టీజింగ్, పనిస్థలాల్లో వేధింపుల నియంత్రణ కోసం రూపొందించిన పోస్టర్‌ను కమిషనరేట్ కేంద్రంలో అడిషనల్ డీసీపీ ఎ లక్ష్మీనారాయణ గురువారం ఆవిష్కరించారు.
కరీంనగర్ క్రైం, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): ర్యాగింగ్, టీజింగ్, పనిస్థలాల్లో వేధింపుల నియంత్రణ కోసం రూపొందించిన పోస్టర్‌ను కమిషనరేట్ కేంద్రంలో అడిషనల్ డీసీపీ ఎ లక్ష్మీనారాయణ గురువారం ఆవిష్కరించారు. తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో షీటీం విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ ఎ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ షీటీం పోలీసులు ర్యాగింగ్, టీజింగ్‌ను అరికట్టేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీపీ వేణుగోపాల్, కరీంనగర్ మహిళా ఠాణా సీఐ పి శ్రీలత, ఆర్‌ఐ రజనీకాంత్, కుమారస్వామి పాల్గొన్నారు.