Share News

సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

ABN , Publish Date - Dec 03 , 2024 | 01:06 AM

ప్రజావాణికి వచ్చే దరఖాస్తు లను పరిశీలించి సమస్యలను సత్వరమే పరిష్కరిం చాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణిలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
దరఖాస్తు స్వీకరిస్తున్న కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

సిరిసిల్ల కలెక్టరేట్‌, డిసెంబరు 2 (ఆంధ్ర జ్యోతి): ప్రజావాణికి వచ్చే దరఖాస్తు లను పరిశీలించి సమస్యలను సత్వరమే పరిష్కరిం చాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణిలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికా రులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడు తూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలన్నారు. త్వరిత గితన పరిష్కారం చూపాపడంతోపాటు అర్జీ దారులకు లిఖిత పూర్వకంగా సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజా వాణిలో 86 దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.

ఫ వ్యవసాయ బావిని పూడ్చాలి

సిరిసిల్ల మున్సిపల్‌ పరిఽధిలోని చంద్రంపేట జంక్షన్‌లో ప్రమాదకరంగా ఉన్న వ్యవసాయ బావిని పూడ్చివేయాలని ఆ వార్డు కౌన్సిలర్‌ పాతూరి రాజిరెడ్డి కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. రోడ్డు నిర్మాణం సమయంలో గ్రామానికి చెందిన వీరగోని శ్రీనివాస్‌ అనే రైతు వ్యవసాయ బావికి పరిహారం ఇచ్చిన తరువాతనే పూడ్చివేయాలంటూ రోడ్డు భవనాల శాఖ అధికారులను అడ్డుకున్నాడు. అధికారులు నష్టపరిహారం ఇవ్వ లేదు. ఎలాంటి రక్షణ చర్యలూ చేపట్టకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు.

ఫ దివ్యాంగుల పింఛన్‌ అందించండి

తంగళ్లపల్లి మండలం మండెపల్లి గ్రామానికి చెందిన తన కూతురు అల్గునూరి శర్వాణి పుట్టుక తోనే దివ్యాంగురాలని పింఛన్‌ అందించాలని ఆమె తండ్రి అల్గునూరి స్వామి కోరాడు. సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందించాడు. ప్రభుత్వం అందించిన సర్టిఫికెట్‌లు ఉన్నాయని పేర్కొన్నాడు.

ఫ ఒంటరి మహిళ పింఛన్‌..

ఒంటరి మహిళ పింఛన్‌ ఇప్పించాలని సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌కు చెందిన ముష్కం రేణ సోమవారం కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే పింఛన్‌ జాబితాలో తన పేరు ఉందని, కానీ పింఛన్‌ రావడం లేదని పేర్కొంది. అద్దె ఇంట్లో నివాసంలో ఉంటూ భవన నిర్మాణా కార్మికు రాలిగా పనులు చేసుకుంటున్నట్లు పేర్కొంది.

Updated Date - Dec 03 , 2024 | 01:06 AM