Share News

కేంద్ర మంత్రి అమిత్‌షా వ్యాఖ్యలపై నిరసనలు

ABN , Publish Date - Dec 21 , 2024 | 12:52 AM

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్‌షాను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం పెద్దపల్లి కమాన్‌ వద్ద సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ, కేవీపీఎస్‌ ఆధ్వర్యం లో నిరసన వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రి అమిత్‌షా వ్యాఖ్యలపై నిరసనలు

పెద్దపల్లిటౌన్‌, డిసెంబరు 20 (ఆంధ్ర జ్యోతి): రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్‌షాను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం పెద్దపల్లి కమాన్‌ వద్ద సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ, కేవీపీఎస్‌ ఆధ్వర్యం లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ము త్యంరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యద ర్శి జిల్లాల ప్రశాంత్‌, కేవీపీఎస్‌ జిల్లా అధ్య క్షుడు మోదంపెళ్లి శ్రావణ్‌ మాట్లాడారు. సీఐటీయూ జిల్లా సహాయకార్య దర్శి జి, జ్యోతి, సిపెల్లి రవీందర్‌, నాయకులు సావణ పెళ్లి వెంకటస్వామి, కుక్క అన్వేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకు లు నితిన్‌, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2024 | 12:53 AM