ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
ABN , Publish Date - Nov 24 , 2024 | 12:15 AM
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ బీఎస్ లత సంబంధిత అఽధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని రామకిష్టాపూర్, కొండాపూర్. పూడూర్, కొడిమ్యాలలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల ను అదనపు కలెక్టర్ పరిశీలించారు.
- అదనపు కలెక్టర్ బీఎస్ లత
కొడిమ్యాల, నవంబరు 23 (ఆంద్రజ్యో తి): ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ బీఎస్ లత సంబంధిత అఽధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని రామకిష్టాపూర్, కొండాపూర్. పూడూర్, కొడిమ్యాలలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల ను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడు తూ ధాన్యం తూకం వెంట వెంటనే వేయాలన్నారు. ధాన్యం లారీల్లో రైస్‌మిల్లుకు తరలించి ట్యాబ్‌లో రైతుల వివరాలు వెంటనే నమోదు చేయాలన్నారు. తద్వారా రైతులకు డబ్బులు తొందరగా రావటానికి అవకాశం ఉంటుందన్నారు. ధాన్యంలో తప్పతాలు లేకుండ చూడా లన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. అనంతరం చెప్యాల క్రాస్ రోడ్డుకు సమీపంలో గల రైస్‌మిల్లులోని వరిధాన్యాన్ని పరిశీలించారు. అదనపు కలెక్టర్ వెంట మల్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు జీవన్‌రెడ్డ్డి, తహసీల్దార్ జి రమేష్, ఆర్‌ఐ కరుణాకర్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ నర్సింహస్వామి, కొడిమ్యాల, పూడూర్ సింగిల్ విండోల కార్యదర్శులు గంగాధర్, రాజేంద ర్‌రెడ్డ్డి, సిబ్బంది, కొనుగోలు కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.
బోనస్ సద్వినియోగం చేసుకోవాలి
మల్యాల (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి చెల్లిస్తున్న 500 రూపాయల బోనస్‌ను రైతు లు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్ సూచిం చారు. పోతారం సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సన్నరకం ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు అమ్మితే నష్టం పోవాల్సి వస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే మద్దతు ధర లభిస్తుందని తెలిపా రు. విండో చైర్మన్ అయిల్నేని సాగర్‌రావు, విండో సీఈవో కె గంగాధర్, రైతులు పాల్గొన్నారు.