Share News

కొనుగోలు చేసిన ధాన్యం త్వరగా తరలించాలి

ABN , Publish Date - Nov 16 , 2024 | 12:54 AM

రైస్‌ మిల్లుల వద్ద ఎలాంటి కోతలు లేకుండా చూడాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించా రు.

కొనుగోలు చేసిన ధాన్యం త్వరగా తరలించాలి

ఎలిగేడు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : రైస్‌ మిల్లుల వద్ద ఎలాంటి కోతలు లేకుండా చూడాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించా రు. శుక్రవారం కలెక్టర్‌ మండలంలో పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రా లు, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పరిశీలించారు. నర్సాపూర్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రం, ఇంటింటి సర్వే, ఎలిగేడు మార్కెట్‌ యార్డు, ఇం టింటి సర్వే, దూళికట్ట గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ రైస్‌ మిల్లుల వద్ద కోతలు లేకుండ చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం నాణ్యతను నిరంతరం పరిశీలించాలని, ధాన్యం తేమశాతం రాగానే వెంటనే కొనుగోలు చేసి, సెంటర్‌కు కేటాయించిన రైస్‌ మిల్లులకు త్వరితగ తిన తరలించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగే లా చూడాలని, కొనుగోలు ధాన్యం వివరాల ట్యాబ్‌ ఎంట్రీ పూర్తి చేయాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. సన్న రకం ధాన్యం కొనుగోలు ప్రక్రియ ను కలెక్టర్‌ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలవద్ద అవసరమైన మేర గన్నీ బ్యాగులు అందుబాటులో పెట్టుకోవాలన్నారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ పక్కాగా చేయాలని సూచించారు. ఈ పర్యటనలో కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ బషీరొద్దీన్‌, అదనపు డీఆర్డివో రవికుమార్‌, ఎంపీడీవో భాస్కర్‌రావు, ఏవో ఉమాపతి, ఏపీఎం సుధాకర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ గోపు విజయ భాస్కర్‌రెడ్డి, సీఈవోలు విక్రమ్‌, రవీందర్‌రెడ్డి సంబంధిత అధికారు లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 12:54 AM