ఇంకుడు గుంతలతో వర్షపు నీటిని ఒడిసిపట్టాలి
ABN , Publish Date - Apr 23 , 2024 | 12:29 AM
వర్షపు నీటిని వృథా పోనివ్వకుండా ప్రతీ నీటి బొట్టును ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంతలను నిర్మించాలని నగరపాలక సంస్థ కమిషనర్ బి శ్రీనివాస్ అన్నారు.
కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 22: వర్షపు నీటిని వృథా పోనివ్వకుండా ప్రతీ నీటి బొట్టును ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంతలను నిర్మించాలని నగరపాలక సంస్థ కమిషనర్ బి శ్రీనివాస్ అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశమందిరంలో ఫంక్షన్ హాల్స్, హోటల్స్, బార్ల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్‌తో అనేక అనర్థాలు జరుగుతున్నందున ప్లాస్టిక్ రహితంగా పెళ్లిళ్లు, శుభాకార్యాలు జరిగేలా చూడాలని అన్నారు. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని, తాగునీటిని వృధా చేయవద్దని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఏసీపీ శ్రీహరి, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఫ ప్లాస్టిక్ వినియోగంపై ఆకస్మిక తనిఖీలు
నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాల మేరకు శానిటరి సూపర్‌వైజర్ రాజమనోహర్, ఎన్విరాన్‌మెంటల్ అధికారి స్వామి, ఇతర సిబ్బంది దుకాణాలు, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లకు రూ.5,250 జరిమానా విధించారు.