దేశంలోనే అగ్రగామి ప్రాజెక్టు రామగుండం ఎన్టీపీసీ
ABN , Publish Date - Nov 15 , 2024 | 12:14 AM
దేశంలోనే రామగుండం ఎన్టీపీసీ అగ్రగామి ప్రాజెక్టు అని, 47 సంవత్సరాలుగా నిరంతరాయంగా దేశానికి వెలుగుల ను అందిస్తోందని ఆర్‌ఈడీ(సౌత్), హెచ్‌వోపీ కేదార్ రంజన్ పాండు పేర్కొన్నారు.
జ్యోతినగర్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : దేశంలోనే రామగుండం ఎన్టీపీసీ అగ్రగామి ప్రాజెక్టు అని, 47 సంవత్సరాలుగా నిరంతరాయంగా దేశానికి వెలుగుల ను అందిస్తోందని ఆర్‌ఈడీ(సౌత్), హెచ్‌వోపీ కేదార్ రంజన్ పాండు పేర్కొన్నారు. గురువారం రామగుండం ఎన్టీపీసీ ఆవిర్భావ వేడుకలలో భాగంగా ఏడీఎం ఆ వర ణలో జరిగిన కార్యక్రమంలో ఆర్‌ఈడీ ప్రసంగించారు. నాలుగున్న దశాబ్దాలపాటు నాణ్యమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ దేశీయ విద్యుత్ రంగానికే ఆదర్శంగా నిల ు స్తున్నదన్నారు. ఉద్యోగులు, అధికారుల సమష్టి కృషి అంకితభావం వల్లనే ఈ ప్రాజె క్టు ఎన్నో ఘనతలను సాధించిందన్నారు. పలు రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, రికార్డులను సాధించిందని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం నుంచి నేటి వరకు విద్యుత్ రంగంలో పలు బెంచ్‌మార్కులను నెలకొల్పిందన్నారు. సుస్థిర అభివృద్ధి, రక్షణ, నిరంతరాయ ఉత్పత్తికి ఈ ప్రాజెక్టులో పని చేసిన, చేస్తున్న సిబ్బంది ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తితోపాటు సామాజికాభి వృద్ధికి కృషి చేశామని తెలిపారు. రామగుండం ఎన్టీపీసీలో రెండు తరాల ఉద్యో గులు ప్రస్తుతం ఉన్నారని, యువ ఇంజనీర్లు సీనియర్ల అనుభవాలను పాఠాలుగా నేర్చుకోవాలని ఆర్‌ఈడీ కేదార్ రంజన్ సూచించారు.
ఘనంగా ఆవిర్భావ వేడుకలు..
రామగుండం ఎన్టీపీసీ 47వ ఆవిర్భావ వేడుకలు గురువారం ఘనంగా జరిగా యి. ఉదయం ప్రభాత్ ఫేరీ పేరిట మార్నింగ్‌వాక్ నిర్వహించారు. టౌన్‌షిప్ షాపింగ్ కాంప్లెక్స్ నుంచి ఎన్టీపీసీ ఏడీఎం భవనం వరకు ర్యాలీ కొనసాగింది. ఏడీ ఎం ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో ఎన్టీపీసీ జెండాను ఆర్‌ఈడీ కేదార్ రంజన్ పాండు ఎగురవేశారు. ఆర్‌ఈడీ, జీఎంలు, సిబ్బంది కేక్ కట్ చేశారు. కార్య క్రమం లో ఎన్టీపీసీ ఎన్‌బీసీ సభుడు, ఐఎన్‌టీయూసీ జాతీయ నేత బాబర్ సలీం పాషా, వివిధ విభాగాల జీఎంలు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.