Share News

రామగుండం ఎన్టీపీసీలో గరిష్ఠ ఉత్పత్తి

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:54 PM

రామగుండం ఎన్టీపీసీ 2024-25 ఆర్థి క సంవత్సరం మొదటి నెలలో గరిష్ఠ విద్యుత్‌ ఉత్పత్తి జరిగింది.

రామగుండం ఎన్టీపీసీలో గరిష్ఠ ఉత్పత్తి

జ్యోతినగర్‌, ఏప్రిల్‌ 30 : రామగుండం ఎన్టీపీసీ 2024-25 ఆర్థి క సంవత్సరం మొదటి నెలలో గరిష్ఠ విద్యుత్‌ ఉత్పత్తి జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో ప్రాజెక్టు 80.10 శాతం ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌(పీఎల్‌ఎఫ్‌)తో 1445.5 మిలియన్‌ యూనిట్ల ఉత్పిత్తి సాధించింది. గత ఆర్థిక సంవత్సరం గడువుకన్నా నిర్దేశిత విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిన రామగుండం ఎన్టీపీసీలో ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఉత్పత్తి టార్గెట్‌ను అధిగమిచేందుకు ప్రణా ళికలు రూపొందించారు. 2600 మెగావాట్ల ఈ సూపర్‌ తర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో మొత్తం 7యూనిట్లు(200 మెగావాట్ల 3 యూ నిట్లు, 500 మెగావాట్ల 4 యూనిట్లు) విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నా యి. ప్రస్తుత డిమాండ్‌కు అనుగుణంగా రోజుకు సగటున 50 నుంచి 55 మిలియన్‌ యూనిట్ల మేరకు ఉత్పత్తి చేస్తున్నది. ప్రస్తు త వేసవిలో విద్యుత్‌ను పొదుతున్న రాష్ట్రాల్లో విద్యుత్‌ డడిమాండ్‌ అధికంగా ఉంటున్నది. ఈ నేపథ్యంలో మరో రెండు నెలలు ప్రాజె క్టులో అన్ని యూనిట్లలో పూర్తిస్థాయి ఉత్పత్తి చేసేందుకు ప్రయ త్నిస్తున్నారు. రానున్న వర్షాకాలంలో ప్రాజెక్టులోని కొన్ని యూనిట్ల కు దశలవారీగా వార్షిక మరమ్మతులు(ఓవర్‌హాల్‌) చేసేందుకు సైతం అధికారులు ప్రణాళికలు సిద్ధంచేశారు. కాగా, రామగుండం ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీపంలోని సింగరేణి గనుల నుంచి లింకేజీ మేరకు సరఫరా జరుగుతున్నట్లు తెలుస్తున్నది.

Updated Date - Apr 30 , 2024 | 11:54 PM