Share News

రామగుండంలో రోడ్ల విస్తరణ ప్రారంభం

ABN , Publish Date - Oct 24 , 2024 | 01:19 AM

రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని వ్యాపార కేంద్రాల్లో ప్రతిపాదిత రోడ్ల విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా గోదావరిఖని లక్ష్మీనగర్‌, కళ్యాణ్‌నగర్‌ పరిధిలో నగరపాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం మార్కింగ్‌ ఇచ్చింది. అజయ్‌ మెడికల్‌ స్టోర్‌ నుంచి బాలాజీ స్వీట్‌ హౌస్‌ మీదుగా పాపులర్‌ షూమార్ట్‌ వరకు 30అడుగులు, మార్కండేయ కాలనీ-లక్ష్మీనగర్‌లను కలిపే ప్రధాన లింకు రోడ్డు అయిన గణేష్‌నగర్‌ బోర్డు-లక్ష్మీనగర్‌ విజయ హాస్పిటల్‌ వరకు 30అడుగులు, రీగల్‌ షూమార్ట్‌-బాలాజీ స్వీట్‌ హౌస్‌ వరకు 40 అడుగులు, రీగల్‌ షూమార్ట్‌ నుంచి కళ్యాణ్‌నగర్‌ చౌరస్తా వరకు 40అడుగులు, ఓల్డ్‌ అశోక థియేటర్‌ నుంచి శక్తి ఎలక్ర్టికల్‌ మీదుగా సాయి జువెల్లర్స్‌ వరకు 30 అడుగులకు మార్కింగ్‌ ఇచ్చారు.

రామగుండంలో రోడ్ల విస్తరణ ప్రారంభం

- ప్రతిపాదిత రహదారుల్లో మార్కింగ్‌

- దీపావళి తర్వాత ఊపందుకోనున్న పనులు

- టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో టెండర్లు

కోల్‌సిటీ, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని వ్యాపార కేంద్రాల్లో ప్రతిపాదిత రోడ్ల విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా గోదావరిఖని లక్ష్మీనగర్‌, కళ్యాణ్‌నగర్‌ పరిధిలో నగరపాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం మార్కింగ్‌ ఇచ్చింది. అజయ్‌ మెడికల్‌ స్టోర్‌ నుంచి బాలాజీ స్వీట్‌ హౌస్‌ మీదుగా పాపులర్‌ షూమార్ట్‌ వరకు 30అడుగులు, మార్కండేయ కాలనీ-లక్ష్మీనగర్‌లను కలిపే ప్రధాన లింకు రోడ్డు అయిన గణేష్‌నగర్‌ బోర్డు-లక్ష్మీనగర్‌ విజయ హాస్పిటల్‌ వరకు 30అడుగులు, రీగల్‌ షూమార్ట్‌-బాలాజీ స్వీట్‌ హౌస్‌ వరకు 40 అడుగులు, రీగల్‌ షూమార్ట్‌ నుంచి కళ్యాణ్‌నగర్‌ చౌరస్తా వరకు 40అడుగులు, ఓల్డ్‌ అశోక థియేటర్‌ నుంచి శక్తి ఎలక్ర్టికల్‌ మీదుగా సాయి జువెల్లర్స్‌ వరకు 30 అడుగులకు మార్కింగ్‌ ఇచ్చారు. ఇప్పటికే ఈ రహ దారులకు సంబం ధించి రోడ్డు డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ అప్రువల్‌ కూడా ఉన్నాయి. సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా మొదటి దశలో కొన్ని రహదారులకు 30అడుగుల వరకే రోడ్ల విస్తరణకు మా ర్కింగ్‌ ఇచ్చారు. మున్సిపల్‌ నిబంధనల ప్రకారం మున్సి పాలిటీలు, కార్పొరేషన్లలో కార్పొరేషన్‌లలో 30అడుగుల రహదారి తప్పనిసరి. వ్యాపార కేంద్రాల్లో 11అడుగులు, 14 అడుగులు, 15అడుగులు మాత్రమే రహదారులు ఉన్నాయి. దీంతో పలు రహదారుల్లో టు వీలర్స్‌ వెళ్లకుండా కూడా కష్టంగానే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో రోడ్ల వెడల్పు ద్వారా వ్యాపార కేంద్రాల్లో కొత్త వ్యాపారాలను నిర్వహించేలా చూడా లని నిర్ణయించారు. విజయ పిల్లల హాస్పిటల్‌ నుంచి గణేష్‌ నగర్‌ బోర్డు వరకు ప్రతిపాదించిన రహదారికి ప్రజలు మార్కింగ్‌ మేరకు స్వచ్ఛందంగా తొలగింపు కార్యక్రమం చేపట్టారు. 9వ డివిజన్‌ కార్పొరేటర్‌ దాతు శ్రీనివాస్‌ గణేష్‌నగర్‌ బోర్డు ప్రాంతంలోని తన భవనానికి మార్కింగ్‌ మేరకు తొలగింపు ప్రక్రియను ప్రారంభించారు. దీంతో పలువురు స్వచ్ఛంద తొలగింపులకు ముందుకు వస్తున్నారు. ఒకేరోజు పది మంది స్వచ్ఛందంగా తొలగింపు ప్రక్రియ ప్రారంభించారు. లక్ష్మీనగర్‌లో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ క్యాస శ్రీనివాస్‌ ఈ రహదారి విస్తరణకు తాను పూర్తిగా సహకరిస్తామంటూ ప్రకటించారు. తన భవనాన్ని సైతం మార్కింగ్‌ మేరకు తొలగించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. లక్ష్మీనగర్‌, మార్కండేయకాలనీ రెండు వ్యాపార కేంద్రాలను లింకు చేయడంలో కీలకమైన ఈ రహదారి విస్తరణ జరిగితే ట్రాఫిక్‌ ఇబ్బందులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అజయ్‌ మెడికల్‌ స్టోర్‌-పాపులర్‌ షూమార్ట్‌ రహదారి విస్తరణ గతంలోను ప్రతిపాదించారు. ఆర్‌డీపీ ఆమోదం కూడా జరిగింది. ఈ రహదారి విస్తరణ జరిగితే లక్ష్మీనగర్‌-కళ్యాణ్‌నగర్‌-మార్కెట్‌ రోడ్‌ల మధ్య లింకు పెరుగుతుంది.

ఫ మార్కింగ్‌లపై గందరగోళం

రామగుండం నగరపాలక సంస్థ గోదావరిఖని పట్టణంలో మూడు రహదారుల విస్తరణకు మార్కింగ్‌ ఇచ్చింది. కొన్నిచోట్ల మార్కింగ్‌ ఇవ్వడంలో ప్రామాణికంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. రహదారి విస్తరణ జరుగుతున్న ప్రాంతాల్లోని నిర్మాణాలు జనగామ గ్రామ పంచాయతీ, నోటిఫైడ్‌ ఏరియా సమయంలో జరిగిన వే. 90 శాతం నిర్మాణాలకు భవన నిర్మాణ అనుమతులు కూడా ఉన్నాయి. పలు భవనాలు ఇటీవల కాలంలో నిర్మించగా నిబంధనల మేరకు సెట్‌ బ్యాక్‌ అయ్యేవి కూడా ఉన్నాయి. కార్పొరేషన్‌ పెట్టిన మార్కింగ్‌లో తేడాలున్నాయి. ముఖ్యంగా లక్ష్మీ నగర్‌లో అజయ్‌ మెడికల్‌ స్టోర్‌ నుంచి పాపులర్‌ షూమార్ట్‌ రహదారిలో ఒక భవ నానికి ఆరు అడుగులు, మరో భవనానికి 10అడుగుల విస్తరణ మార్కింగ్‌ పెట్టారు. ఈ రెండు పాత భవనాలే. అలాగే గణేష్‌నగర్‌ బోర్డు నుంచి విజయ హాస్పిటల్‌ రహదారిలో కూడా కొత్త నిర్మించిన సెట్‌ బ్యాక్‌ భవనాలకు, పాత భవనాలకు ఒకే రీతిలో మార్కింగ్‌ పెట్టారనే ఇంటి యజమానులు ఆరా తీస్తున్నారు. 30అడుగుల రహదారి సెట్‌ బ్యాక్‌ అయి నిర్మించామని, మళ్లీ మార్కింగ్‌ పెట్టడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా రోడ్డు విస్తరణ మార్కింగ్‌ చేసే సమయంలో రోడ్డు సెంటర్‌గా తీసుకుని ఇరువైపులా మార్కింగ్‌ ఇస్తారు. రామగుండం నగరపాలక సంస్థ రోడ్ల విస్తరణ, ఆక్రమణ తొలగింపు తదితర పనుల కోసం యంత్రాలు, మెటీ రియల్‌ తరలించే ట్రాక్టర్లు, ఇతర సామగ్రి మ్యాన్‌పవర్‌కు సంబంధించి ఖర్చు కూడా తడిసి మోపడవుతుంది. ఇప్పటి వరకు ఓచర్‌ బిల్లులపై పేమెంట్‌ చేస్తున్నా రు. ఇందులో పాదర్శకత ఉండే అవకాశం లేకపోవడంతో అంచనాలు రూపొందించి రూ.10లక్షలతో టెండర్‌కు ప్రతిపాదించారు.

ఫ రోడ్ల విస్తరణ జరిగితేనే పనులు

టీయూఎఫ్‌ఐడీసీ(తెలంగాణ అర్బన్‌ ఫైనాన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) నిధులతో రామగుండంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. ముఖ్యంగా వ్యాపార కేంద్రాల్లోనే మౌలిక సదుపాయలకు రూ.35 కోట్లు కేటాయించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయ్యింది. కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రోడ్ల విస్తరణ ప్రక్రియ జరిగితేనే అభివృద్ధి పనులు ముం దుకు పోనున్నాయి.

Updated Date - Oct 24 , 2024 | 01:19 AM