Share News

నగదు బదిలీ కేంద్రాలుగా రేషన్‌ దుకాణాలు

ABN , Publish Date - Nov 16 , 2024 | 01:15 AM

జిల్లాలోని పలు రేషన్‌ దుకాణాలు నగదు బదిలీ కేంద్రాలుగా మా రుతున్నాయి. నిరుపేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వాలు ఉచితంగా రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బి య్యం పక్కదారి పడుతోంది. గతంలో కొందరు రేషన్‌ బి య్యం దళారులకు విక్రయించి నగదు తీసుకోగా... ప్రస్తు తం పంథా మారింది.

నగదు బదిలీ కేంద్రాలుగా రేషన్‌ దుకాణాలు

- కిలో బియ్యానికి రూ. 10 నుంచి రూ. 15 అందజేత

- పక్కదారి పడుతున్న పీడీఎస్‌ బియ్యం

- ప్రతీనెల కోటా డ్రా కోసం బయో మెట్రిక్‌

జగిత్యాల, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు రేషన్‌ దుకాణాలు నగదు బదిలీ కేంద్రాలుగా మా రుతున్నాయి. నిరుపేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వాలు ఉచితంగా రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బి య్యం పక్కదారి పడుతోంది. గతంలో కొందరు రేషన్‌ బి య్యం దళారులకు విక్రయించి నగదు తీసుకోగా... ప్రస్తు తం పంథా మారింది. రేషన్‌ దుకాణాల వద్దనే బియ్యం దందా బాహాటంగా సాగుతోంది. కొన్ని చోట్ల రేషన్‌ డీలర్లే దళారుల అవతారమెత్తి బియ్యం పంపిణీని నగదు బదిలీ పథకం మారుస్తున్నారు. బియ్యం కోటాకు బదులుగా కిలో బియ్యం డిమాండ్‌ బట్టి రూ. 10 నుంచి రూ. 15 వ రకు లెక్కగట్టి మరీ కార్డు దారులకు నగదు ఇస్తున్నారు. ఉచిత కరోనా కాలం నుంచి ఆహార భద్రత కార్డు దారుల కు ఉచిత బియ్యం పంపిణీ పథకం కొనసాగుతోంది. ఈ బియ్యం తినలేని పలు కుటుంబాలు కేవలం తమ రేషన్‌ కార్డు కాపాడుకునేందుకు నెలవారీగా బియ్యం కోటా తీ సుకొని దళారులకు విక్రయిస్తున్నారు. తాజాగా రేషన్‌ డీ లర్లే ఆ బియ్యం కొనుగోలుకు తెరలేపు తుండడం చర్చనీయాంశంగా మారింది.

జిల్లా వ్యాప్తంగా ఆహార భద్రత కార్డులు ఇలా..

జిల్లాలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన 592 రేషన్‌ దుకాణాల ద్వారా ప్రతీ నెల పేదలకు ఉచిత బియ్యం, రేషన్‌ బియ్యం పంపిణీ జరుగుతోంది. జిల్లాలో మొత్తం 3,07,852 రేషన్‌ కార్డులుండగా ఇందులో 2,93,354 ఆ హార భద్రతా కార్డులు, 14,352 అంత్యోదయ కార్డులు, 146 అన్నపూర్ణ కార్డులున్నాయి. ప్రతీనెల సుమారు 9,197 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యాన్ని సుమారు 8,87,297 మందికి పౌరసరాఫరా శాఖ ద్వారా పంపిణీ చేస్తున్నారు.

బయో మెట్రిక్‌ ద్వారా..

రేషన్‌ కార్డు దారులు నేరుగా వెళ్లి బయో మెట్రిక్‌ ద్వారా వేలి ముద్ర వేసి నగదు తీసుకోవడం పలు ప్రాం తాల్లో పరిపాటిగా మారింది. దీంతో బియ్యం రేషన్‌ దు కాణాల నుంచే నేరుగా బ్లాక్‌ మార్కెట్‌కు చేరుతోంది. బి య్యం పక్కదారి పట్టకుండా సంస్కరణల్లో భాగంగా ప్ర భుత్వం ఈ పాస్‌ అమలు చేస్తోంది. లబ్ధిదారుల బయో మెట్రిక్‌, ఐరిస్‌, ఓటీపీ తప్ననిసరిగా మారింది. దీంతో డీలర్లు లబ్ధిదారుల ఆమోదంతో ఈ పాస్‌పై కార్డు దారు ల బయో మెట్రక్‌ తీసుకొని నగదు చెల్లిస్తున్నారు. ఫలి తంగా బియ్యం పక్కదారి పట్టిస్తున్న వ్యాపారుల ఆగడా లకు అడ్డుకట్ట పడడం లేదు.

అవసరం లేకపోయినా కార్డులు..

జిల్లాలో పలు రకాల రేషన్‌ కార్డుల కోసం ప్రభుత్వం ఉచిత బియ్యం సరఫరా చేస్తోంది. జిల్లాలో ఉన్న రేషన్‌ కార్డులలో సుమారు పాతిక శాతం అనర్హత కలిగిన కు టుంబాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రేషన్‌ కార్డు బహుళ ప్రయోజకారి కావడంతో నిరుపేద లతో పాటు ఆదాయ వర్గాలు కూడా కార్డులు పొందుతు న్నారు. వారికి రేషన్‌ బియ్యం అవసరం లేకపోయినా కా ర్డు రద్దు కాకుండా ఉండడం కోసం అప్పుడప్పుడు బి య్యం కోటా తీసుకుంటున్నారు. ఇంటి అవసరాల కోసం కొంత బియ్యం తీసుకొని మిగితా బియ్యం విక్రయిస్తున్నారు.

రేషన్‌ దుకాణాల్లో పేదలకు బియ్యం పంపిణీ కోసం ప్రభుత్వం కిలోకు రూ. 32.94 వ్యయం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కిలో బియ్యం రూ. 31 పలుకుతుండగా రవా ణా, నిర్వహణ కలిపి అదనంగా రూ. 1.94 వ్యయం అవు తోందంటున్నారు. లబ్ధిదారులు మాత్రం తమ కోటా బియ్యాన్ని తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. ఉచిత బియ్యం పక్కదారి వ్యవహారంలో దళారులు లాభాలను ఆర్జిస్తున్నారు.

పట్టుబడుతున్నా.. ఆగని వ్యాపారం..

జిల్లాలోని పలు చోట్ల ఒక వైపు రేషన్‌ బియ్యం తరలింపు పట్టుబడుతున్న ప్ప టికీ, మరో వైపు అక్రమ వ్యాపారం ఆగడం లేదు. గ్రామాల్లోని కొందరు కిరాణ దు కాణ దారులు, రేషన్‌ వ్యాపారులు నియమించిన కమిషన్‌ ఏజెంట్లు వినియోగదా రుల నుంచి రూ. 10 నుంచి రూ. 15లకు కిలో బియ్యం చొప్పున కొనుగోలు చేస్తు న్నారు. కిలోల చొప్పున కొనుగోలు చేసి క్వింటాళ్లలో జమ చేస్తున్నారు. బియ్యం వ్యాపారుల నుంచి రూ. 2 నుంచి రూ. 5 వరకు కమీసన్‌ తీసుకొని బియ్యం అప్ప గిస్తున్నారు. అక్రమ బియ్యం వ్యాపారులు టన్నుల కొద్ది బియ్యం ఇతర ప్రాం తాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు మిల్లర్లకు రూ. 20 చొప్పున విక్రయిస్తున్నారు. ఓ అంచనా ప్రకారం ప్రతీ రోజు జిల్లా నుంచి ఇతర ప్రాంతా లకు రూ. కోటి విలువ చేసే బియ్యం తరలి వెళ్తున్నట్లు సమాచారం. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు, టాస్క్‌పోర్స్‌ పోలీసుల వరస దాడుల్లో రేషన్‌ బి య్యం అక్రమ రవాణా ఆయా సందర్బాల్లో వెలుగు చూస్తోంది. కానీ అధికారులు మామూలుగానే వ్యవహిరిస్తున్నారన్న ఆరోపణలు చోటు చే సుకుంటున్నాయి.

Updated Date - Nov 16 , 2024 | 01:15 AM