Share News

గ్యారెంటీలతో ప్రజలను ఆగం చేసిండు..

ABN , Publish Date - Nov 18 , 2024 | 12:39 AM

ఆరు గ్యారెంటీలు అమలుచేస్తామని అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా పూర్తిస్థాయి అమలులో ప్రభుత్వం విఫల మైందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ఆరోపించారు.

గ్యారెంటీలతో ప్రజలను ఆగం చేసిండు..

కమాన్‌పూర్‌, నవంబరు 17(ఆంధ్రజ్యోతి) : ఆరు గ్యారెంటీలు అమలుచేస్తామని అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా పూర్తిస్థాయి అమలులో ప్రభుత్వం విఫల మైందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ఆరోపించారు. ఆదివారం మం డలంలో కాంగ్రెస్‌ ప్రజా వంచన దినోత్సవాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళల ఉచిత బస్సు హామీ పథకం తప్ప మిగతా ఆరుగ్యారెంటీ హామీలను పూర్తిగా విస్మరించారన్నారు. ప్రజలు నమ్మి ఓట్లు వేసి అధికారం అప్పగిస్తే వాళ్లను దగా చేశారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్న మంథని ఎమ్మెల్యే పథకాల అమలులో విఫలం అయ్యార న్నారు. పదవుల కోసమే చూశారే తప్ప పేద ప్రజల సంక్షేమంపై ఆలోచన లేదన్నా రు. కాంగ్రెస్‌ అంటేనే మోసం, అబద్ధాలు అని, సన్నరకం ధాన్యంకు బోనస్‌ అంటూ రైతులను మభ్యపెడుతున్నారన్నారు. ఇప్పటివరకు రైతు రుణమాఫీ వందశాతం చేయలేదన్నారు. తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామంటూ మహా రాష్ట్రలో ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీ లను, ఆరు గ్యారెంటీ పథకాలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు తాటికొండ శంకర్‌, గుర్రం లక్ష్మీమల్లు, కొండ వెంకటేష్‌, బొల్లపల్లి శంకర్‌గౌడ్‌, సాయికుమార్‌, గొమ్మగొని అనిల్‌గౌడ్‌,పోలుదాసరి సాయికు మార్‌, తోట వీరస్వామి, భూమయ్య, చిన్నం తిరుపతి, పొన్నం రాజేశ్వరి, నీలం శ్రీని వాస్‌, జాబ్‌ సతీష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 18 , 2024 | 12:39 AM