Share News

ఫిర్యాదులపై స్పందించి న్యాయం జరిగేలా చూడాలి

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:34 AM

పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుసై వేగంగా స్పందించి బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలని ఎస్పీ అశోక్‌కుమార్‌ పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా జగి త్యాల పట్టణ పోలీస్‌స్టేషన్‌ సోమవారం ఎస్పీ తనిఖీ చేసి మాట్లాడారు.

ఫిర్యాదులపై స్పందించి న్యాయం జరిగేలా చూడాలి
రిసెప్షన్‌లో వివరాలు పరిశీలిస్తున్న ఎస్పీ అశోక్‌ కుమార్‌

- ఎస్పీ అశోక్‌కుమార్‌

జగిత్యాల క్రైం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుసై వేగంగా స్పందించి బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలని ఎస్పీ అశోక్‌కుమార్‌ పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా జగి త్యాల పట్టణ పోలీస్‌స్టేషన్‌ సోమవారం ఎస్పీ తనిఖీ చేసి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉంటూ క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైన కేసులు, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పోలీస్‌స్టేషన్‌కు అనుసంధానం చేసిన కమాండ్‌ కం ట్రోల్‌ రూంను ఎస్పీ ప్రాంభించారు. పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటా రు. కార్యక్రమంలో డీఎస్పీ రఘచందర్‌, సీఐ వేణు గోపాల్‌, డీసీఆర్‌బీ ఇన్‌స్పె క్టర్‌ శ్రీనివాస్‌, ఎస్సైలు కిరణ్‌కుమార్‌, మన్మధరావు, గీత, మల్లేశం ఉన్నారు.

కేసుల సత్వర పరిష్కారంపై దృష్టి సారించాలి

- మెట్‌పల్లి డీఎస్పీ రాములు

కోరుట్ల, డిసెంబరు 30 (ఆంద్రజ్యోతి): పోలీసు స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలని మెట్‌పల్లి డీఎస్పీ ఎ రాములు కోరుట్ల పోలీసులకు సూచించారు. వార్షిక తనిఖీ లో భాగంగా కోరుట్ల సీఐ సురేష్‌బాబుతో కలిసి సోమవారం పట్టణంలోని పోలీస్‌స్టే షన్‌ను సంద ర్శించారు. ఈ సందర్భంగా కోరుట్ల పోలీస్‌స్టేషన్‌లో కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న కేసు వివారాలను, పరిష్కార విషయాలను ఎస్‌ఐలతో పాటు పోలీసులను అడిగి తెలుసుకున్నారు. అ నంతరం వారి యోగక్షేమాలపై ఆరాతీశారు. అక్రమ వ్యాపారాలపై, రౌడీషీటర్ల కదలికపై నిరంతం నిఘా పెట్టాలని సూచించారు. డయల్‌ 100 నంబర్‌కు వచ్చే ఫోన్లపై తక్షణమే స్పందించి విజి టింగ్‌చేసి పోలీసింగ్‌ను పెంచాలని సూచించారు. కోరుట్ల సర్కిల్‌ పరిధిలో నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు శ్రీకాంత్‌, రామచంద్రం పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 12:34 AM