భూ నిర్వాసితులకు రూ.50 లక్షల పరిహారం ఇప్పించాలి
ABN , Publish Date - Nov 14 , 2024 | 12:47 AM
నేషనల్ హైవేలో భూ ములు కోల్పోతున్న రైతులకు 50లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ డిమాండ్ చేశారు.
పెద్దపల్లిటౌన్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : నేషనల్ హైవేలో భూ ములు కోల్పోతున్న రైతులకు 50లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ డిమాండ్ చేశారు. బుధవారం బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ నేషనల్ హైవే నిర్మాణంలో మంథని నియోజకవర్గంలో వందల ఎకరాల్లో భూములు పోతున్నాయని, అందు లో మంథని మండలం పుట్టపాక ప్రధాన రహదారి పక్కనే ఉన్న భూ ములకు ప్రస్తుతం కోటి రూపాయల విలువ ఉందన్నారు. ఈ క్రమంలో మంథని ఎమ్మెల్యే 25లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని లేఖ రా శాడన్నారు. అయితే ప్రధానమంత్రికి రాసిన లేఖ తెలుగులో రాయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలను మభ్యపెట్టి మోసం చేయడానికి ఇలా చేశాడన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనే ఉంద ని, మంథని ఎమ్మెల్యే మంత్రి హోదాలో ఉండి కూడా ఇప్పటివరకు నేష నల్ హైవే నిర్వాసితులకు న్యాయం చేయాలనే ఆలోచన చేయలేద న్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్వాసితులకు ముందుగా మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించి ఫీల్డ్‌లోకి రావాలన్నారు. మంథని ఎ మ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే నిర్వాసితులకు ఎకరాకు రూ.50లక్షలు ఇప్పిం చాలని, ఇండ్లకు సైతం సరైన కొలతలు తీసి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు గుజ్జుల రాజిరెడ్డి, అత్తె చంద్రమౌళి, ప్రకాష్ రెడ్డి,నూనె కుమార్, సుదాటి రవీందర్‌రావు, కాపుర బోయిన భాస్కర్, పెగడ శ్రీనివాస్, రొడ్డ శ్రీనివాస్, మధు ఉన్నారు.