మాతృ భూమి సేవకు అవతరించిన సంస్థ ఆర్ఎస్ఎస్
ABN , Publish Date - Oct 12 , 2024 | 12:28 AM
విద్యాభారతి దక్షిణమధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ అన్నారు. నగరంలో విజయదశమి పథ సంచాలన్ ఉత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభూమి సేవ కోసం ఉద్భవించిన సంస్థ ఆర్ఎస్ఎస్ అన్నారు. గ్లోబల్స్కోప్ ఉన్న ఏకైక జాతీయ వాద సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అన్నారు.
భగత్‌నగర్ అక్టోబరు 11: విద్యాభారతి దక్షిణమధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ అన్నారు. నగరంలో విజయదశమి పథ సంచాలన్ ఉత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభూమి సేవ కోసం ఉద్భవించిన సంస్థ ఆర్ఎస్ఎస్ అన్నారు. గ్లోబల్స్కోప్ ఉన్న ఏకైక జాతీయ వాద సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అన్నారు. డాక్టర్ జీ విజయదశమి రోజు ఆర్ఎస్ఎస్ను నాగపూర్‌లో స్థాపించారన్నారు. పది మంది పిల్లలతో ప్రారంభమైన శాఖ దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరించిందన్నారు. కార్యక్రమంలో సంక్షేమ ట్రస్టు ట్రస్టీ బల్మూరి కరుణాకర్‌రావు, ఆర్ఎస్ఎస్ బాధ్యులు రమణాచారి, జిల్లా సంఘ చాలక్ నిరంజనాచారి, హన్మండ్ల శ్రీనివాస్‌రెడ్డి, స్వయంసేవకులు పాల్గొన్నారు.