Share News

ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ అవార్డు అందుకున్న సింగరేణి

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:28 AM

సింగరేణి ఓసీపీ-1 ప్రాజెక్టు ప్రతిష్టాత్మక ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ సాధించడంతో యాజమాన్యం అవార్డు అందుకున్నది.

ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ అవార్డు అందుకున్న సింగరేణి

యైుటింక్లయిన్‌కాలనీ, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): సింగరేణి ఓసీపీ-1 ప్రాజెక్టు ప్రతిష్టాత్మక ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ సాధించడంతో యాజమాన్యం అవార్డు అందుకున్నది. సోమవారం రాత్రి న్యూఢిల్లీలోని స్కోప్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో బొగ్గు శాఖా మంత్రి కిషన్‌రెడ్డి, సహాయ మంత్రి సతీష్‌ చంద్రదుబే చేతుల మీదుగా సీఎండీ బలరాం, డైరెక్టర్‌(పీపీ) వెంకటేశ్వరరెడ్డి, ప్రాజెక్టు అధికారి రాధా కృష్ణలు అవార్డు అందుకున్నారు. దేశవ్యాప్తంగా కోల్‌ ఇండియా, సింగరేనితో పాటు ఇతర ప్రైవేట్‌ సంస్థ లకు సంబంధించి 380 గనులు ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రమాద రహితంగా ఉన్న అత్యు న్నత గనులను ప్రతి ఏడాది కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఎంపిక చేస్తున్నది. రక్షణను పెంపొందించడం, రక్షణలో పోటీతత్వం పెంపొందించడం కోసం ఈపోటీలను బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నది. ప్రమాద రహిత గనులను తనిఖీ చేసి మెరుగైన వాటికి ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ ఇస్తున్నది. గత ఏడాది నిర్వహించిన పోటీల్లో సింగరేణికి చెందిన రెండు భూగర్భ గనులు ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ దక్కిం చుకున్నాయి. ఈఏడాది రెండు ఓసీపీలు ఆ ఘనత సాధించాయి.

Updated Date - Oct 23 , 2024 | 12:28 AM