Share News

దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి కార్మికులు

ABN , Publish Date - Dec 24 , 2024 | 12:41 AM

సింగరేణి కార్మికు లు తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులు అంది స్తున్నారని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. సింగరేణి 136 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగరేణి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి గోదావరిఖని జవహర్‌ లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి కార్మికులు
సింగరేణి ఆవిర్భావ కేక్‌కట్‌ చేస్తున్న ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌, జీఎం లలిత్‌కుమార్‌

- సింగరేణికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

- ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌

- ఘనంగా ఆవిర్భావ వేడుకలు

గోదావరిఖని, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికు లు తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులు అంది స్తున్నారని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. సింగరేణి 136 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగరేణి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి గోదావరిఖని జవహర్‌ లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సీఎస్‌ఆర్‌, డీఎంఎఫ్‌టీ నిధులను స్థానకంగా ఖర్చు చేయించకుండా వేరే ప్రాంతాల్లో ఖర్చు చేశారని ఆయన ఆరో పించారు. సింగరేణి కార్మికులకు రక్షిత నీటిని అందించడంలో ఇబ్బందులు తలెత్తితే తాను సీఎండీ బలరాంనాయక్‌తో మాట్లా డి సింగరేణి కార్మికులకు రక్షిత మంచినీటిని అందించాలని, గ్రావిటీ ఫిల్టర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నార న్నారు. సింగరేణి లాభాల వాటాలో కాంట్రాక్టు కార్మికులకు కూడా లాభాల వాటా ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరగా వెంటనే స్పందించి కాంట్రాక్టు కార్మికులకు కూడా లాభా ల వాటా ఇచ్చారని చెప్పా రు. ఈ సందర్భంగా కేక్‌కట్‌ చేసి మిఠాయిలను పంపిణీ చేశారు. అనంతరం చిన్నా రులు ప్రదర్శించిన నృత్యా లు, సాంస్కృతిక కార్యక్ర మాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆర్‌జీ-1 జీఎం లలిత్‌కుమార్‌, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్‌, సేవా సమితి అధ్య క్షురాలు అనిత లలిత్‌ కుమార్‌, కాంగ్రెస్‌ నాయకురాలు మనాలీ ఠాకూర్‌, 11వ డివిజన్‌ కార్పొరేటర్‌ పెద్దెల్లి తేజస్వినిప్రకాష్‌, డీజీఎం(పర్సనల్‌) కిరణ్‌ బాబు, సెక్యూరిటీ ఆఫీసర్‌ వీరారెడ్డి, ఏఐటీయూసీ నాయకులు కె స్వామి, మడ్డి ఎల్లయ్య, సింగరేణి కో ఆర్డినేటర్‌ బంగారు సారంగపాణి పాల్గొన్నారు.

ఆర్జీ-1లో..

గోదావరిఖని: ఉద్యోగులు, అధికారుల సమష్టి కృషితోనే బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించి సంస్థ మనుగడ కోసం కృషి చేస్తు న్నారని ఆర్‌జీ-1 జీఎం లలిత్‌కుమార్‌ అన్నారు. సోమవారం సింగరేణి ఆవిర్భావ వేడుకల సందర్భంగా జీఎం కార్యాలయంలో జెండావిష్కరణ చేశారు. అనంతరం జరిగిన విలేకరుల సమా వేశంలో ఆయన మాటాడారు. మారుతున్న బొగ్గు అవసరాల నేపథ్యంలో ఉత్పాదకత పెంచి ఉత్పత్తి వ్యయం తగ్గించుకోవాల్సి న అవసరం ఎంతైనా ఉందన్నా రు. అనంతరం బైక్‌ ర్యాలీగా వేడుకల వేదిక సింగరేణి స్టేడియానికి చేరుకున్నారు. సింగరేణి స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను లలిత్‌ కుమార్‌, సేవా అధ్యక్షురాలు అనితలలిత్‌కుమార్‌ ప్రారంభించారు. కార్యక్రమం లో ఎస్‌ఓటూ జీఎం గోపాల్‌సింగ్‌, పర్సనల్‌ డీజీఎం కిరణ్‌బాబు, డీజీఎం(ఫైనాన్స్‌) ధనలక్ష్మిభాయ్‌, సీనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్లు బంగారు సారంగపాణి, శ్రావణ్‌ కుమార్‌, హనుమంతరావు, ఏఐటీయూసీ నాయకులు స్వామి, ఆరెల్లి పోషం, మడ్డి ఎల్లయ్య, సీఎంవోఏ నాయకులు పొనగోటి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఆర్జీ-2లో...

యైుటింక్లయిన్‌కాలనీ: ఆర్జీ-2 జీఎం కార్యాలయంలో జీఎం బండి వెంకటయ్య, డివిజన్‌ పరిధిలోని అన్ని గనులు, డిపార్ట్‌ మెంట్లపై అధికారులు సింగరేణి పతాకాలను ఆవ్కిరించారు. అబ్దుల్‌ కలాం క్రీడామైదానంలో జీఎం స్టాల్స్‌ని ప్రారంభించారు. సాయంత్రం జరిగిన ప్రధాన ఉత్సవంలో ఉత్తమ ఉద్యోగు లుగా ఎంపికైన వారిని ఘనంగా సన్మానించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్ళు ఆకట్టుకోగా సాంసృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా జీఎం వెంకటయ్య మాట్లాడారు. భవిష్యత్తు తరాలకు సిరుల సింగరేణిని అందించే బాధ్యత నేటి ఉద్యోగులపై ఉందన్నారు. కార్యక్రమాల్లో రెస్క్యూ జీఎం శ్రీనివా సరెడ్డి, ఏరియా సేవా అధ్యక్షురాలు వనజా వెంకటయ్య, ఏఐటీ యూసీ అసిస్టెంట్‌ బ్రాంచి సెక్రెటరీ శ్యాంసన్‌, పీవో మధుసూ దన్‌, ఎస్వోటూ జీఎం రాముడు పాల్గొన్నారు.

ఆర్జీ-3లో..

రామగిరి: సింగరేణి ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని ఉదయం ఆడ్రియాల ప్రాజెక్టు ఏరియా ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జీఎం కార్యాలయం ఆవరణలో ఏపీఏ జెండాను ఆవిష్కరించగా ఆర్జీ-3 జీఎం సుధాకర్‌రావు సెంటినరీకాలనీలోని రాణిరుద్రమదేవి క్రీడాప్రాం గణంలో జెండాను ఆవిష్కరించారు. అనంతరం డివిజన్లలోని వివిధ యంత్రాలతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. ఏరియాలో ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన అధికారులను, ఉద్యోగులను, సేవా సభ్యులను ఘనంగా సత్కరించారు. ఆవిర్భా వ వేడుకల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. వేడుక ల్లో అదికారుల సంఘం అధ్యక్షుడు సీహెచ్‌ వెంకటరమణ, సేవా అధ్యక్షురాలు అలివేణి, విజయలక్ష్మివెంకటేశ్వర్లు, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు వైవీ రావు, ఎంఆర్‌సీ రెడ్డి, కోట రవీందర్‌రెడ్డి, అదికారులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 12:41 AM