ఆరు గ్యారంటీలను దశల వారీగా అమలు చేస్తున్నాం
ABN , Publish Date - Dec 26 , 2024 | 12:34 AM
ఆరు గ్యారంటీలను దశల వారీగా అమలు చేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. అంతర్గాం మండలంలోని కల్యాణలక్ష్మి, షాదీము బారక్ లబ్ధిదారులకు బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ చెక్కుల పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్
కళ్యాణ్‌నగర్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యో తి): ఆరు గ్యారంటీలను దశల వారీగా అమలు చేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. అంతర్గాం మండలంలోని కల్యాణలక్ష్మి, షాదీము బారక్ లబ్ధిదారులకు బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ చెక్కుల పంపిణీ చేశారు. వివిధ గ్రామాలకు చెందిన తొమ్మిది మంది కల్యాణలక్ష్మి, షాదీముబాకర్ లబ్ధిదారుకు రూ.9.1 లక్షల చెక్కులను అందజేశారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలకుర్తి మండలం సంబంధించి రెండోసా రి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేస్తామని తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆరు గ్యారంటీలను దశల వారీగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీలో రూ.10లక్షల వరకు ఉచిత వైద్యం, రూ.500లకు గ్యాస్ సిలిండర్, సన్న ధాన్యం క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని వివరించారు. బీఆర్‌ఎస్ నాయకులు రైతు రుణమాఫీ జరగలేదని, రైతుబంధు ఇవ్వలేదని అక్కడక్కడ ధర్నాలు చేశారన్నా రు. ధర్నాలు చేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని, పది సంవత్సరాల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండుసార్లు రైతు రుణమాఫీ చేస్తామని మోసం చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలోనే 70శాతం పైగా రైతులకు రుణమాఫీ చేశామని తెలిపారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభు త్వ హయాంలో రైస్‌మిల్లర్లతో కుమ్మక్కై క్వింటా ల్‌కు 10 నుంచి 20 కిలోల వడ్ల కటింగ్ చేసిన బీఆర్‌ఎస్ నాయకులు ఏ ముఖం పెట్టుకొని రైతుల గురించి మాట్లాడుతున్నా రని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి, మోసం చేసి, పారిపోయే పార్టీ కాదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ రుణమాఫీ చేస్తామని, రైతు భరోసాను అందిస్తామని, స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ అంటేనే అబద్ధాల పార్టీ అని అన్నారు. కార్యక్రమంలో లబ్ధిదారులు అంతర్గాం తహసీల్దార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.