అర్హులందరికీ ఆరు గ్యారెంటీలు అమలు
ABN , Publish Date - Feb 01 , 2024 | 12:26 AM
అర్హులైన ప్రతి ఒక్క రికి ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు.
పెద్దపల్లి రూరల్, జనవరి 31 : అర్హులైన ప్రతి ఒక్క రికి ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. బుధవారం మండలంలోని బ్రాహ్మణపల్లిలో ఈజీఈఎస్ నిధులు రూ.20లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే విజయరమణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమా వేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రెండు పథకాలను అమలు చేస్తోందని అన్నా రు. రైతులు పండించిన ధాన్యం విక్రయించాలంటే గత ప్రభుత్వం కటింగ్ పేరుతో మోసం చేసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపడుతామన్నారు. అనం తరం గ్రామపంచాయతీ పాలకవర్గం ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రామ్మూర్తి, ఎంపీడీవో రాజు, ఎంపీ వో సుదర్శన్, సర్పంచ్ గాండ్ల మల్లేశం, ఎంపీటీసీ నిర్మల-శ్రీని వాస్, ఏడెల్లి శంకర్, ఉప్పు రాజు, రాజేందర్, పరమేష్, గుమ్మడి విజయ్, ఉపసర్పంచ్ రాజు తదితరులు పాల్గొన్నారు.