రైతులకు బాసటగా రాష్ట్ర ప్రభుత్వం
ABN , Publish Date - Nov 09 , 2024 | 12:37 AM
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బాసటగా ఉంటుందని సుడా చైర్మన్ కొమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. నగర శివారులోని తీగలగుట్టపల్లిలో కaరీంనగర్ వ్యవసాయ సహాకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు.
కరీంనగర్ రూరల్, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బాసటగా ఉంటుందని సుడా చైర్మన్ కొమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. నగర శివారులోని తీగలగుట్టపల్లిలో కరీంనగర్ వ్యవసాయ సహాకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా రైతులు కాంటాల్లో తేడాలు వేస్తున్నట్లు తెలిపారు. దీనిపై ఆయన తాలు లేకుండా తీసుకురావాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు పంటను అమ్ముకోవడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 18 వేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఖాజానను ఖాళీ చేసిందని, ఆర్థిక ఇబ్బందులున్నా అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో .కరీంనగర్ పీఎసీఎస్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, సంఘం డైరెక్టర్లు మూల వెంకటరమణారెడ్డి, సీఈవో రమేష్, కార్పొరేటర్లు కొలగాని శ్రీనివాస్, కాశెట్టి లావణ్య శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ మూల కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.