క్రిస్టియన్ల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు
ABN , Publish Date - Dec 25 , 2024 | 01:06 AM
క్రిస్టియన్ల అభ్యున్నతి తెలంగాణ ప్రభుత్వం తోడ్పాటు నందిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు అన్నారు.
పెద్దపల్లి కల్చరల్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : క్రిస్టియన్ల అభ్యున్నతి తెలంగాణ ప్రభుత్వం తోడ్పాటు నందిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు అన్నారు. మంగళవారం పెద్దపల్లి పట్ట ణంలోని డీసెంట్ ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజయరమణారావు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ను సంతోషంగా జరుపుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని. పెద్దపల్లి ప్రాంతంలో ఉన్న చర్చిల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటా మన్నారు. కార్యక్రమంలో క్రిస్టియన్ మత పెద్దలు, ఫాస్టర్స్, పెద్దపల్లి మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, సుల్తానాబాద్ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, పట్టణ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.