ప్రతిభావంతులైన విద్యార్థులకు తోడ్పాటు
ABN , Publish Date - Dec 31 , 2024 | 12:37 AM
జిల్లాలో క్రీడలకు సంబంధించి ప్రతిభావంతులైన విద్యార్థులకు అవసర మైన తోడ్పాటు అందిస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
పెద్దపల్లి కల్చరల్, డిసెంబరు 30 (ఆంధ్ర జ్యోతి) : జిల్లాలో క్రీడలకు సంబంధించి ప్రతిభావంతులైన విద్యార్థులకు అవసర మైన తోడ్పాటు అందిస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం కలెక్టర్ కోయ శ్రీహర్ష కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఆర్చరీ క్రీడాకారుడు ధీరజ్‌రావుకు కాంపౌం డ్ బో పంపిణీ చేశారు. రామగుండంకు చెందిన ధీరజ్‌రావు జాతీయస్థాయి ఆర్చరీ పోటీలలో మంచి ప్రతిభ కనబర్చిన నేప థ్యంలో తనకు కాంపౌండ్ బో కావాలని కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు పరిశీలించిన కలెక్టర్ విద్యార్థికి అవసరమైన కాంపౌండ్ బో కొనుగోలు చేసి సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి సురేష్, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి కొమ్ము రోజు శ్రీనివాస్, పేట సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి సురేందర్, డి రమేష్, ధీరజ్‌రావు తల్లిదండ్రులు పాల్గొన్నారు.