Share News

కన్నుల పండువగా స్వామివారి కల్యాణం

ABN , Publish Date - Nov 16 , 2024 | 12:56 AM

మండలంలోని దేవునిపల్లి లక్ష్మీనృసింహస్వామి కల్యాణ మహోత్సవాన్ని శుక్రవారం అర్చకులు దేదీప్యామానంగా నిర్వహించారు.

కన్నుల పండువగా స్వామివారి కల్యాణం

పెద్దపల్లి రూరల్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని దేవునిపల్లి లక్ష్మీనృసింహస్వామి కల్యాణ మహోత్సవాన్ని శుక్రవారం అర్చకులు దేదీప్యామానంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామి వారి కల్యాణ తంతును కన్నులపండువగా నిర్వహిస్తూ కల్యాణ సమ యం వరకు మాంగల్యదారణ నిర్వహించారు. ఆలయం వద్ద భక్తులంతా దీపారాధన నిర్వహించి లక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈనెల 12 నుంచి 21 వరకు స్వామి వారి బ్రహోత్సవాలు నిర్వ హించనున్నారు. అందులో భాగంగా కల్యాణ మహోత్స వం అనంతరం నిర్వహించే కార్యాలకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఆలయాన్ని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సందర్శించి స్వామివారిని దర్శించు కోని పూజలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన మాజీ ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యలో భక్తులు కల్యాణ మహోత్సవానికి హజరయ్యారు. బ్రహ్సో తవాల దృష్ట్యా జాతర ప్రాంగణంలో ఎలాంటి సంఘట నలు జరగకుండా బసంత్‌నగర్‌ పోలీస్‌ ఆధ్వర్యంలో భారీబందోబస్త్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో శంకరయ్య, చైర్మన్‌ సదయ్య, ఆలయ అర్చకులు కొండప ాక లక్ష్మీ నర్సింహచార్యులు, కొండపాక శ్రీకాంతచార్యులు, శ్రీధరాచార్యులు, మాజీ సర్పంచ్‌లు కిషన్‌, మాజీ ఎంపీ టీసీ పందిళ్ల లక్ష్మణ్‌, నాయకులు బొక్కల సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 12:56 AM