కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన టీబీజీకేఎస్
ABN , Publish Date - Dec 30 , 2024 | 12:36 AM
సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిం ది టీబీజీకేఎస్ అని యూనియన్ వర్కింగ్ ప్రెసి డెంట్ మాదాసి రామమూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య అన్నారు.
గోదావరిఖని, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిం ది టీబీజీకేఎస్ అని యూనియన్ వర్కింగ్ ప్రెసి డెంట్ మాదాసి రామమూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య అన్నారు. ఆదివా రం స్థానిక టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో జీడికే 11ఇంక్లైన్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథిలుగా హాజ రై మాట్లాడారు. సింగరేణిలో కార్మికులకు అనేక హక్కులు సాధించడంతో పాటు కార్మికుల సమ స్యల పరిష్కారానికి కృషి చేశామని, జాతీయ కార్మిక సంఘాలు పోగొట్టిన ప్రధానమైన డిపెం డెంట్ ఎంప్లాయిమెంట్‌ను సాధించి యువ కార్మి కులకు అండగా నిలబడ్డామని, తద్వారా వారి జీవితాలలో వెలుగులు నింపిన ఘనత టీబీజీకే ఎస్‌దన్నారు. కార్మికుల కోసం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎనలేని కృషి చేశారని, అధికారంలో లేక పోవడంతో కార్మికుల సమస్యలు పరిష్కారం కా కుండా పోయాయన్నారు. బొగ్గుగనులను ప్రైవేట్ పరంచేసే కేంద్ర ప్రభుత్వ కుట్రలకు మద్దతు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నద న్నారు. ఈ నేపథ్యంలో కార్మిక సమస్యల పరి ష్కారం కోసం, హక్కులు కాపాడేందుకు టీబీజీకే ఎస్ చిత్తశుద్ధితో పోరాటం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా 11ఇంక్లైన్ పిట్ కమిటీని ఎన్నుకు న్నారు. కార్యదర్శిగా వాసర్ల జోసెఫ్, అసిస్టెంట్ కార్యదర్శిగా చంద్రు శ్రీనివాస్, డివిజన్ కార్యదర్శు లుగా పల్లె సురేందర్, సాయిచరణ్‌లను ఎన్నుకు న్నారు. యూనియన్ కేంద్ర కార్యదర్శి మోదుంప ల్లి రాజేశం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర అధికార ప్రతినిధి పర్లపెల్లి రవి, డివిజన్ ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్, ఎల్ వెంకటేష్, చెల్పూరి సతీష్, కోండ్ర అంజయ్య, పర్లపెల్లి అభి షేక్, బొగ్గుల సాయి, మీస రాజు పాల్గొన్నారు.