Share News

కార్మికుల పక్షాన నిలిచేది టీబీజీకేఎస్‌..

ABN , Publish Date - Nov 24 , 2024 | 12:53 AM

ఏపార్టీ అధికా రంలో ఉన్నా కార్మికుల పక్షాన నిలిచే సంఘం టీబీజీకేఎస్‌ మాత్ర మేనని యూనియన్‌ ఆర్జీ-2 వైస్‌ ప్రెసిడెంట్‌ అయిలి శ్రీనివాస్‌ అన్నా రు.

కార్మికుల పక్షాన నిలిచేది టీబీజీకేఎస్‌..

యైుటింక్లయిన్‌కాలనీ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఏపార్టీ అధికా రంలో ఉన్నా కార్మికుల పక్షాన నిలిచే సంఘం టీబీజీకేఎస్‌ మాత్ర మేనని యూనియన్‌ ఆర్జీ-2 వైస్‌ ప్రెసిడెంట్‌ అయిలి శ్రీనివాస్‌ అన్నా రు. శనివారం వకీల్‌పల్లె గని కార్మికులను కలసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా అయిలి శ్రీనివాస్‌ మాట్లాడారు. గత ఏడాది 18 నెలల పాటు యాజమాన్య అవరాల నిమిత్తం సర్ఫేస్‌లో విధులు కేటాయించిన కార్మికులకు అండర్‌ గ్రౌండ్‌ అలవెన్స్‌లు కోత విధించడం వలన ఆర్థికంగా నష్టపోయినట్టు తెలిపారు. 190 మస్టర్లు పూర్తికాక బదిలీ వర్కర్లు జనరల్‌ మజ్దూర్‌లుగా ప్రమోషన్లకు అర్హత కోల్పోయే పరిస్థితి నెలకొన్నట్టు పేర్కొన్నారు. అనారోగ్య కారణాల రీత్యా సీనియర్‌ కార్మికులను యాజమాన్యం అవసరాల నిమిత్తం సర్ఫేస్‌ పనిలో కేటాయించిందని, అటువంటి వారిని కొందరు యూని యన్‌ నాయకులు ఇబ్బందులకు గురిచేయడం అనైతికమన్నారు. కార్మికుల పక్షాన నిలవాల్సిన నాయకులు కార్మికులను ఇబ్బందులకు గురిచేఏ విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. సర్ఫేస్‌లో ఏర్ప డిన టెక్నీషియన్‌ ఖాళీలను భర్తీ చేయాలని, మెడికల్‌ గ్రౌండ్స్‌ కింద ఖాళీగా ఉన్న జనరల్‌ మజ్దూర్‌ ఖాళీలను సీనియార్టీ కోటాలో భర్తీ చేయాలని యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు. వకీల్‌పల్లె గనిలో సమస్యల పరిష్కారం దిశగా గని అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వెంకటేష్‌, రాములు, తిరుపతి, శ్రీనివాస్‌, లెనిన్‌, రాజారాం, సురేందర్‌, శ్రీకాంత్‌, రంజిత్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 24 , 2024 | 12:54 AM