Share News

మారుతున్న రాజకీయ ముఖచిత్రం

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:56 AM

జిల్లా రాజ కీయాల్లో ఈ యేడాది ఎన్నో సంచలనాలు... ఊహిం చని రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి...

మారుతున్న రాజకీయ ముఖచిత్రం

జగిత్యాల, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లా రాజ కీయాల్లో ఈ యేడాది ఎన్నో సంచలనాలు... ఊహిం చని రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి... లో క్‌సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీల నేతలు జిల్లాలో పర్యటించి, పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపారు...లోకసభ ఎన్నికల్లో ఎమ్మె ల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి నాబీజేపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ చే తిలో ఓటమి పాలయ్యారు...జగిత్యాలకు చెందిన బీఆర్‌ ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కండువాను కప్పు కున్నారు..2024 సంవత్సరంలో బీఆర్‌ఎస్‌ ఉనికిని కాపా డుకోవడానికి ప్రయత్నించగా...కాంగ్రెస్‌, బీజేపీలతో మా త్రం ఉత్సాహాన్ని నింపింది.

ప్రముఖుల రాకతో సందడి..

లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు తీర్పునిచ్చారు. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పోటీ చేసినా ఓటర్లు సిట్టింగ్‌ ఎంపీ, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ను గెలిపించారు. ఈ తీర్పు బీజేపీని మరోమారు బలపరిచినట్లయింది. లో క్‌సభ ఎన్నికల సందర్భంగా పలువురు రాజకీయ ఉద్దం డులు జగిత్యాల జిల్లాలో పర్యటించారు. జగిత్యాలలో ఈ యేడాది మార్చి 18వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప ర్యటించి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌కు మద్దతుగా ప్రచారం జరిపారు. కరీంనగర్‌ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బండి సంజయ్‌ కథలాపూర్‌, మేడిపల్లి, భీమారం మండలాల్లో ఫిబ్రవరి 11, 12వ తేదీల్లో ప్రజాహిత యా త్ర చేపట్టారు. అదేవిధంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ రెడ్డికి మద్దతుగా మాజీ సీఎం, గులాభీ దళపతి కేసీఆర్‌ జగిత్యాలలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్‌ రెడ్డి జగిత్యాలలో ప్రచారం చేశారు. ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌ పితృవియోగానికి గురైన సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌ జగిత్యాలలో పర్యటిం చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కొండగట్టు లో పర్యటించి అంజన్న మొక్కును చెల్లించుకున్నారు. మంత్రులు కొండ సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు జగి త్యాల, ధర్మపురి నియోజక వర్గాల్లో ఆయా సందర్భాల్లో పర్యటించారు.

చర్చనీయాంశంగా మారిన కాంగ్రెస్‌ రాజకీయం..

గత యేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌ అనూహ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి స మక్షంలో కండువాను మార్చారు. ప్రస్తుత యేడాది జూన్‌ 23వ తేదీన సీఎం రేవంత్‌ రెడ్డి హైద్రాబాద్‌లో ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి తనకు సమాచారం లేకుండా ఎమ్మెల్యే సంజయ్‌ను పా ర్టీలో ఎలా చేర్చుకుంటారని అలకబూనారు. జీవన్‌ రెడ్డిని బుజ్జగించడానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఇతర నే తలు రంగంలోకి దిగారు. ఈ వ్యవహారం చినికి చినికి గా లివానాల తయారై చివరికి జీవన్‌రెడ్డిని అధిష్టానం ఢిల్లీకి పిలిపించుకుని బుజ్జగించింది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎమ్మెల్సీ అలక ప్రభావాన్ని చాటింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎడమొహం, పెడమొహంలా ఉంటునే పలు రాజకీయ, అభివృద్ధి, సంక్షేమ కార్యకలా పాల్లో పాల్గొంటున్నారు. కోరుట్ల నియోజకవర్గంలో కాం గ్రెస్‌ మరింత పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ధర్మపురి నియోజకవర్గంలో ప్రభుత్వ విప్‌, డీసీ సీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, వేములవాడ ని యోజకవర్గంలోని కథలాపూర్‌, మేడిపల్లి, బీమారం మం డలాల్లో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, చొప్పదండి నియో జకవర్గంలోని కొడిమ్యాల, మల్యాల మండలాల్లో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాంగ్రెస్‌ కార్యక్రమాలను విస్తృతంగా ని ర్వహిస్తూ మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తు న్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధా నాల ను అవలంభిస్తుందని పలు సందర్భాల్లో బీఆర్‌ఎస్‌ నేత లు జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజవకర్గాల్లో పార్టీ కార్యకర్తలు నిరసనలు, రాస్తారోకో, ధర్నాలు వంటివి నిర్వహించారు. ఇటీవల నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత జగిత్యాలలో పర్యటించారు. ఉద్యమ తె లంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు జగిత్యాలలో భూ మిపూజ చేశా రు.

పూర్వ వైభవం కోసం బీఆర్‌ఎస్‌ యత్నాలు..

జగిత్యాల జిల్లాలో పునర్‌ వైభవం సాధించడానికి బీ ఆర్‌ఎస్‌ విస్తృతంగా ప్రయత్నాలు చేస్తోంది. గతంలో జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రాతినిత్యం వహించారు. గత యేడాది జరి గిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం కోరుట్లలో మాత్రమే బీ ఆర్‌ఎస్‌ సత్తా చాటింది. ఈనేపథ్యంలో జిల్లాలో పట్టును సాధించుకోవడానికి బీఆర్‌ఎస్‌ ప్రయత్నం చేసింది. రైతు ల సమస్యల పరిష్కారాన్ని డిమాండ్‌ చేస్తూ కోరుట్ల ఎ మ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌ రావు కోరుట్ల నుంచి జగిత్యాల వరకు పాదయాత్ర నిర్వహించారు. జగిత్యాల లో నిర్వహించిన రోడ్‌ షోకు మాజీ మంత్రి, తన్నీరు హ రీశ్‌ రావుతో పాటు పలువురు రాష్ట్ర, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా స్థాయి బీఆర్‌ఎస్‌ నేతలు హాజరై రైతులను చైతన్య వంతులను చేయడానికి ప్రయత్నించారు.

లోక్‌ సభ ఎన్నికల్లో సత్తా చాటుకున్న బీజేపీ...

ప్రస్తుత యేడాది ఆరంభంలో జరిగిన లోక్‌ సభ ఎన్ని కల్లో బీజేపీ సత్తాను చాటుకుంది. నిజామాబాద్‌ పార్ల మెంట్‌ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సి ట్టింగ్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మరోసారి విజయం సా ధించారు. కరీంనగర్‌ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బండి సంజయ్‌ మళ్లీ సత్తా చాటి ఎంపీగా గెలుపొందారు. ధ ర్మపురి నియోజకవర్గంలో మాత్రం లోక్‌ సభ ఎన్నికల్లో బీ జేపీ హవా కనిపించలేదు. ఎంపీలుగా గెలుపొందిన ధర్మ పురి అర్వింద్‌, బండి సంజయ్‌లు జిల్లాపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టి పలు సార్లు పర్యటించారు. పలు అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

బల్ధియాల్లో అవిశ్వాసాలు..

జిల్లాలోని పలు మున్సిపాలిటీలల్లో ప్రస్తుత యేడాది అవిశ్వాస రాజకీయాలు చోటు చేసుకున్నాయి. జగిత్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్థానం ఖాళీగా ఉండడం, బీఆర్‌ ఎస్‌కు చెందిన మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌ ఇ న్‌చార్జి చైర్మన్‌గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో మా రిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఖాళీగా ఉన్న జగిత్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవికి ఎన్నికను నిర్వహించింది. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ అ డువాల జ్యోతి లక్ష్మణ్‌ ఎన్నికల్లో విజయం సాధించినప్ప టికీ వెనువెంటనే ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ లో చేరారు. రాయికల్‌, కోరుట్ల మున్సిపల్స్‌లో అవిశ్వాస రాజకీయం తెరపైకి వచ్చినప్పటికీ నేతల జోక్యంతో సద్దు మనిగింది. అదేవిదంగా పలు సింగిల్‌ విండోలలో సైతం అవిశ్వాస రాజకీయాలు చోటుచేసుకున్నాయి.

Updated Date - Dec 27 , 2024 | 12:56 AM