ముగిసిన సీఎం కప్ రాష్ట్రస్థాయి జూడో పోటీలు
ABN , Publish Date - Dec 30 , 2024 | 12:39 AM
తెలంగాణ రాష్ట్రస్థాయి సీఎం కప్-2024 జూడో పోటీలు ముగిశాయి. మూడు రో జులుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ఈ పోటీలు ఆది వారం ముగిశాయి.
కరీంనగర్ స్పోర్ట్స్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రస్థాయి సీఎం కప్-2024 జూడో పోటీలు ముగిశాయి. మూడు రో జులుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ఈ పోటీలు ఆది వారం ముగిశాయి. జిల్లా యువజన క్రీడాశాఖాధికారి శ్రీనివాస్‌గౌడ్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఈసీ మెంబర్ మహేందర్ చివరిరోజు పోటీలను ప్రారంభించారు. ఈ పో టీలకు 29 జిల్లాల నుంచి 400 మందికిపైగా క్రీడాకారులు పాల్గొనగా వీరందరికి కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలలో మూడు రోజులు వసతి, సౌకర్యాలు కలెక్టర్ సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లే కుండా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో జూడో అసోసియేషన్ మెం బర్స్, టెక్నికల్ అసోసియేషన్ మెంబర్స్, పీఈటీ, పీడీలు, కోచ్‌లు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు తెలంగాణ రాష్ట్ర జట్లకు ప్రాతినిధ్యం వహి స్తారని జిల్లా యువజన క్రీడాశాఖాధికారి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. విజేతలకు హైదరాబాద్‌లో జరగనున్న బహుమతి ప్రదానోత్సవ కార్యక్ర మంలో సీఎం చేతులమీదుగా పతకాలను, నగదు పురస్కారాలను అందించనున్నారు.
బాలికల విభాగంలో విజేతలు..
- 48 కేజీల విభాగంలో ఎస్ రమ్య(ఆదిలాబాద్), సీహెచ్ క్రిస్మస్ (భద్రాద్రి కొత్తగూడెం), బి నక్షత్ర(హనుమకొండ) గెలుపొందారు.
- 52కేజీల విభాగంలో ఆర్ చాందిని(ఆదిలాబాద్), సావిత్రి (నారాయణపేట), చరిష్మ(యాదాద్రి భువనగిరి)
- 57 కేజీల విభాగంలో కె అలేఖ్య(ఆదిలాబాద్), బి స్పందన (ఖమ్మం), తేజశ్రీ(నిజామాబాద్), 63 కేజీల విభాగంలో ఎన్ శ్రీజ (వరంగల్), వి కావ్య(సూర్యాపేట), వి సాయిప్రీతి(రంగారెడ్డి), 70 కేజీల గ్రిల్స్ విభాగంలో కె రేవతి(వికారాబాద్), ఎ సుష్మిత(కరీంనగర్), కె కృపా(హన్మకొండ)
- 70 కేజీలపై విభాగంలో ఎంఎస్ శివాని(హైదరాబాద్), వెంకట రితిక(కరీంనగర్), కె బ్లెస్సీ(సూర్యాపేట) విజేతలుగా నిలిచారు.
బాలుర విభాగంలో విజేతలు..
- 50 కేజీల విభాగంలో ఎల్ సతీష్(ఆదిలాబాద్), ఎ రామ తేజ(నిజామాబాద్), బి గణేష్(కరీంనగర్),
- 55కేజీల విభాగంలో ఆర్ తరుణ్(ఆదిలాబాద్), పి ప్రశాం త్(భద్రాద్రి కొత్తగూడెం), ఎండీ సుతుద్దిఖాన్(హైదరాబాద్)
- 60 కేజీల విభాగంలో శ్రీహరి(జోగులాంబ గద్వాల్), బి సతీస్ కుమార్(ఖమ్మం), ఎం హర్షవర్ధన్(ఆదిలాబాద్)
- 66కేజీల విభాగంలో కె అఖిల్(జయశంకర్ భూపాలపల్లి), ఆర్ గణేశ్(కరీంనగర్), ఎండీ నసీరుద్దీన్(వరంగల్),
- 66 కేజీల పై విభాగంలో కె సంజీవ్(హైదరాబాద్), బి రవి (మహబూబాబాద్), ఆర్ మధు(ఆదిలాబాద్) విజేతలుగా నిలిచారు.
రాష్ట్రస్థాయి సీఎంకప్ హ్యాండ్‌బాల్ పోటీల్లో..
ఉమ్మడి జిల్లా జట్టుకు తృతీయ స్థానం
కరీంనగర్ స్పోర్ట్స్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి సీఎంకప్ హ్యాండ్‌బాల్ పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాలుర జట్టు తృతీయ స్థానం సాధించింది. ఈ నెల 27 నుంచి 29 వరకు హన్మకొండలో నిర్వహించిన పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాలుర జట్టు బ్రాంజ్ మెడల్ సాధించినట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీర్ల వెంకటేశ్వర్‌రావు, బసరవేణి లక్ష్మణ్ తెలిపారు. ఈ సందర్భంగా డీవైఎస్‌వో శ్రీనివాస్, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నందెల్లి మహిపాల్, జనార్దన్, ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కాసర్ల ఆనంద్ కుమార్, రమణరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి నమిలకొండ ప్రభాకర్, కోచ్ మూల వెంకటేశ్, ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ సంఘ బాధ్యులు పెద్దపల్లి కన్వీనర్ సురేందర్, సిరిసిల్ల కన్వీనర్ జె కృష్ణహరి, జగిత్యాల కన్వీనర్ పెద్దబోయిన శ్రీనివాస్, ప్రేమ్, విద్యాసాగర్, సీనియర్ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.