పది నెలల్లో ఆసుపత్రి భవన నిర్మాణం పూర్తి..
ABN , Publish Date - Dec 25 , 2024 | 12:57 AM
గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నూతనంగా నిర్మిస్తున్న 350 పడ కల ఐదు అంతస్థుల భవనాన్ని పది నెలల్లో పూర్తిచేసి రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష కాంట్రాక్టర్ల కు సూచించారు.
కళ్యాణ్‌నగర్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నూతనంగా నిర్మిస్తున్న 350 పడ కల ఐదు అంతస్థుల భవనాన్ని పది నెలల్లో పూర్తిచేసి రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష కాంట్రాక్టర్ల కు సూచించారు. మంగళవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ తనిఖీ చేశా రు. రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో నూతనంగా నిర్మిస్తు న్న భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, ప్రభుత్వం నిర్దేశ లక్ష్యం ప్రకా రం పది నెలల్లో పూర్తిచేసి ఆసుపత్రి భవనాన్ని రోగులకు అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. రూ.140కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఐదు అంతస్థుల భవనంలో అన్ని హంగులతో వైద్య సేవలను అందించనున్నట్టు కలెక్టర్ చెప్పారు. పాత, కొత్త బిల్డింగ్‌ల్లో వార్డులకు వెళ్లి రోగులకు అందుతున్న వైద్య సేవలపై రోగులతో మాట్లా డారు. ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, ఈఎన్‌టీ, డెంటల్, ఏఆర్‌టీ సెంటర్ బ్లాక్‌లను పరిశీలించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ హిమబిందు, ఆర్‌ఎంఓలు అప్పారావు, చంద్రశేఖర్, అశోక్, ప్రొఫెసర్లు ఉన్నారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని ప్రిడియార్టిక్, ఆర్థోపెడిక్, ఈఎన్‌టీ ఓపీలను కలెక్టర్ శ్రీహర్ష తనిఖీ చేశారు. కలెక్టర్ తనిఖీ చేసిన సమయంలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, హెచ్‌ఓడీలు లేకపోవడంతో వివరాలను కలెక్టర్ తీసుకున్నారు. వైద్యులు లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ తనిఖీ సమయంలో ఓపీ విభాగాల్లో వైద్యులు లేకపోవడంపై కలెక్టర్ శ్రీహర్ష సిమ్స్ ప్రిన్సిపాల్ హిమబిందుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిరోజులుగా ప్రభుత్వ జనర ల్ ఆసుపత్రిలో హెచ్‌వోడీలు, ప్రొసెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సక్రమంగా విధులు నిర్వహించడం లేదనే సమాచారంతోకలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.