Share News

ఎన్నికల హామీలు నేరవేర్చని ప్రభుత్వం..

ABN , Publish Date - Nov 13 , 2024 | 12:38 AM

ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏఒక్కటి నేరవేర్చకుండా ప్రజలను నయవంచన చేస్తోందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పుట్ట మధు ఆరోపించారు.

ఎన్నికల హామీలు నేరవేర్చని ప్రభుత్వం..

మంథని, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏఒక్కటి నేరవేర్చకుండా ప్రజలను నయవంచన చేస్తోందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పుట్ట మధు ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలం గడుస్తున్న మహిళలకు ఒక్క ఉచి త బస్సు ప్రయాణం తప్ప ఏఒక్క హామీని ప్రభుత్వం అమలు చేయడం చేయడం లేదన్నారు. ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాల న్నారు. ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా మంథని ఎమ్మెల్యే సొంత నియోజక ర్గంలోనే హామీలు అమలుకావడం లేదన్నారు. దీనిపై ఎమ్మెల్యేను నిలదీయాలన్నా రు. ఈ నెల 14 నుంచి డిసెంబరు 9 వరకు మంథని నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుతంగా నయవంచన దినోత్సవాలను నల్లబ్యాడ్జీలు ధరించి అంబేద్కర్‌ విగ్రహాల వద్ద, కూడళ్ళ వద్ద నిరసన చేపడుతామన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్ర మంలో ఏగో ళపు శంకర్‌గౌడ్‌, తగరం శంకర్‌లాల్‌, మాచీడి రాజుగౌడ్‌, బెల్లకొండ ప్రకాష్‌రెడ్డి, గీతాబాయి, దేవళ్ళ విజయ్‌కుమార్‌, జంజర్ల శేఖర్‌, వేల్పుల గట్టయ్య, మంథని లక్ష్మణ్‌, రాజబాబు, కుమార్‌లు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 12:38 AM