విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
ABN , Publish Date - Dec 20 , 2024 | 12:39 AM
విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని భారత విద్యార్ధి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు శనిగరపు రజనీకాంత్ అన్నారు.
- ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజనీకాంత్
సిరిసిల్ల రూరల్, డిసెంబరు 19 (అంధ్రజ్యోతి): విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని భారత విద్యార్ధి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు శనిగరపు రజనీకాంత్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో అయన మాట్లాడారు. విద్యారంగ సమస్యలు పరిష్కారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న కూడా ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని సీఎం రేవంత్‌రెడ్డి నియమించకపోవడంతో విద్యారంగ సమస్యలను పట్టించుకునే వారే లేకుండా పోయారని వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. కాంగ్సెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుందని ప్రజా విజయోత్సవాలను జరుపుకోవడం కాదని, విద్యాశాఖ మంత్రిని నియమించి రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కారించాలని కోరారు. ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. గురుకులాల్లో విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారని పెంచిన మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలను వెంటనే అమలు చేయాలన్నారు. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురకులంలో పాముకాటుకు మరో విద్యార్ధి గురయ్యాడని అన్నారు. సిరిసిల్ల జిల్లాలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విద్యాశాఖలో పనిచేసే సమగ్ర శిక్ష ఉద్యోగులు 10 రోజులుగా రిలే నిరహార దీక్షలను చేస్తున్నారని వారి సమస్యలను పరిష్కరించాలని డిమండ్ చేశారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు మంద అనిల్‌కుమార్, జిల్లా కార్యదర్ళి మాల్లారపు ప్రశాంత్, ఉపాధ్యక్షుడు జూలపల్లి మనోజ్, కుర్ర రాకేష్, గుండెల్లి కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.