కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:28 AM
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. తమ ప్రధాన డిమాండ్లైన మినిమమ్ పే స్కేలు, జీవిత బీమా, హెల్త్‌కార్డులు, మహిళ ఉద్యోగులకు 108 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు,
సుభాష్‌నగర్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. తమ ప్రధాన డిమాండ్లైన మినిమమ్ పే స్కేలు, జీవిత బీమా, హెల్త్‌కార్డులు, మహిళ ఉద్యోగులకు 108 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు, 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు 20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్, మరణించిన కుటుంబాలకు 15 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు బెజ్జంకి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడు గుండా రాజిరెడ్డి, ప్రధానకార్యదర్శి మహేశ్, ఉపాధ్యక్షులు రమేశ్, రవిచంద్ర, బి శ్రీకాంత్, కేజీబీవీ ప్రత్యేక అధికారులు ఎం అజిత, బి రమాదేవి, ఎన్ పూర్ణిమ, గౌతమి, పి మాదవి, పి కిరణ్‌జ్యోతి, ఎం స్వప్న, ఏ సునీత, పి మధులత, వరలక్ష్మి, నీరజ, రవిచందర్, ఆంజనేయులు, వెంకటేష్, శ్రీకన్య, బి రమేశ్ పాల్గొన్నారు.
ఫ హైదబాద్‌లో టీపీటీఎఫ్ ధర్నా
కరీంనగర్ టౌన్: సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ధర్నాలో జిల్లా నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జంకె రామచంద్రారెడ్డి, వేల్పుల బాలయ్య, రాష్ట్ర కౌన్సిలర్స్ అర్కాల శ్రీనివాస్, కొలుగూరి కిషన్‌రావు, ఉపాధ్యక్షుడు ఎస్ రామస్వామి పాల్గొన్నారు.