పోలీసు శాఖలో హోంగార్డుల సేవలు కీలకం
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:35 AM
పోలీసు శాఖలో హోంగార్డుల సేవలు కీలకమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో శుక్రవారం 62వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు.
సిరిసిల్ల కైరం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖలో హోంగార్డుల సేవలు కీలకమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో శుక్రవారం 62వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సాధారణ విధుల నుంచి క్లిష్టతర విధుల వరకు అన్నింటా చక్కగా పనిచేస్తూ హోంగార్డు వ్యవస్థ పోలీస్ శాఖలో కీలకంగా మారిందన్నారు. హోంగార్డుల సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు. అంతకు ముందు ఎస్పీ సాయుధ హోంగార్డు ప్లాటూన్ల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కవాతు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు రమేష్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.