Share News

‘స్వీప్‌’ ద్వారా ఓటు ప్రాముఖ్యాన్ని వివరించాలి

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:11 AM

బాధ్యత గల పౌరులుగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునే లా ఓటు ప్రాముఖ్యత వివరిస్తూ స్వీప్‌ కార్యక్రమాలు నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ జే.అరుణశ్రీ పేర్కొన్నారు.

‘స్వీప్‌’ ద్వారా ఓటు ప్రాముఖ్యాన్ని వివరించాలి

పెద్దపల్లిటౌన్‌, మార్చి 28: బాధ్యత గల పౌరులుగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునే లా ఓటు ప్రాముఖ్యత వివరిస్తూ స్వీప్‌ కార్యక్రమాలు నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ జే.అరుణశ్రీ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పార్లమెంట్‌ ఎన్నికలలో పోలింగ్‌ శాతం పెరిగేలా స్వీప్‌ కార్యక్రమాల నిర్వహణపై సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్‌ సమీక్షించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లా డుతూ జిల్లాలోని 3అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మొత్తం 7లక్షల 15వేల 735 మంది ఓటర్లు ఉన్నారని, ప్రతి ఒక్క ఓటరు ఎన్నికల్లో తప్పనిసరిగా తమ ఓటు హక్కు విని యోగించుకునేలా ఓటు ప్రాముఖ్యతపై విస్తృతంగా ప్ర చారం చేయాలన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేర కు జిల్లాలో ఓటర్లను చైతన్యపరిచేందుకు, ఓటింగ్‌ శాతం పెరిగేలా, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్విని యోగం చేసుకునేలా అవగాహన కల్పించేందుకు ఓటర్‌ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపా రు. గత ఎన్నికల్లో తక్కువ పోలింగ్‌ నమోదైన ప్రాంతాల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అదనపు కలెక్టర్‌ సూచిం చారు. స్వీప్‌ కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో ఉన్న అన్ని విద్యాసంస్థల్లో ఎలకో్ట్రరల్‌ లిటరసీ క్లబ్‌లు ఏర్పాటు చే యాలని, జిల్లాలో ఉన్న అన్ని డిగ్రీ, ఇంజనీరింగ్‌ కళాశా లలో క్యాంపస్‌ అంబాసిడర్లను నియమించాలని, 18 సం వత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో నమోదు చేసి వారి ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామపం చాయతీలో ప్రత్యేక గ్రామసభలను ఏర్పాటు చేసి ఓటరు నమోదు, వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. ఓటు హక్కు ప్రాముఖ్యత వివరించే కరపత్రాలను పంపి ణీ చేయాలని, వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్న ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల ద్వారా ఓటు ప్రాముఖ్యతను వివ రించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సబ్‌ సెంటర్లలో ఓటు హక్కు ప్రాముఖ్యత వివరించేలా గోడ ప్రతులను ప్రదర్శించాలని, జిల్లాలో ఉన్న దివ్యాంగులు, ట్రాన్స్‌ జెం డర్స్‌, సీనియర్‌ సిటిజన్లు తప్పనిసరిగా ఓటుహక్కు విని యోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఉన్న వృద్ధాశ్రమాలు, దివ్యాంగుల సంస్థలలో ఓటర్‌ అవ గాహన కల్పించాలని, వృద్ధులు, దివ్యాంగులకు అవసర మైతే ఇంటివద్ద ఓటు హక్కు వినియోగించుకునే అవకా శం ఉందని వివరించాలన్నారు. రామగుండంలో ఉన్న సింగ రేణి మైనింగ్‌ ఏరియా, ఎన్టీపీసీ, కేశోరాం ఫ్యాక్టరీ, ఆర్‌ ఎఫ్‌సీఎల్‌ మొదలగు సంస్థల్లో పనిచేసే కార్మికుల కోసం ప్రత్యేక ఓటర్‌ నమోదు, అవగాహన కార్యక్రమా లు నిర్వహించాలన్నారు. ఆర్డీవోలు హనుమా నాయక్‌, గంగయ్య, జడ్పీ సీఈవో నరేందర్‌, డీఆర్‌డీవో రవీందర్‌, డీపీవో ఆశాలత, డీఈవో మాధవి, స్వీప్‌ యాక్టివిటీస్‌ నోడల్‌ అధికారి రౌఫ్‌ఖాన్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌, ఇంటర్మీడియేట్‌ జిల్లా అధికారి కల్పన, పరిశ్రమ లశాఖ జీఎం మధుసూదనాచారీ పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:11 AM