అభివృద్ధి, సంక్షేమ పనుల్లో వేగం పెంచాలి
ABN , Publish Date - Dec 31 , 2024 | 12:32 AM
అభివృద్ధి, సంక్షేమ పనులు మరింత వేగ వంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సోమవారం పట్టణంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ విభాగా లకు చెందిన జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావే శాన్ని నిర్వహించారు.
- కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమ పనులు మరింత వేగ వంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సోమవారం పట్టణంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ విభాగా లకు చెందిన జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావే శాన్ని నిర్వహించారు. హైద్రాబాద్‌లో నిర్వహి స్తున్న సీఎం ప్రజావాణి కార్యక్రమం నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరిం చాలన్నారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అద నపు కలెక్టర్ బీఎస్ లత, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ గౌతమ్‌రెడ్డి, ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్‌రెడ్డి, కలెక్టరేట్ కార్యా లయ ఏవో హన్మంతరావు పాల్గొన్నారు.
రోడ్డు భద్రతా చర్యలు తీసుకోవాలి
జగిత్యాల అర్బన్: జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాద నివారణ చర్యలు తీసుకుని ప్రమాదా లను తగ్గించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం రోడ్ సేఫ్టీ అండ్ రవాణా, ఎన్‌హెచ్- 63 అధికారులతో సమీక్ష సమావేశం నిర్వ హించారు. రోడ్డు ప్రమాద స్పాట్‌లను గుర్తించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశిం చారు. హైవే, ఆర్‌అండ్‌బీ రోడ్డులో ప్రమాదాలు జరుగ కుండా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డుపై గుంతలను, రోడ్డు పక్కన ఉన్న బావులను పూడ్చాలని ఆదేశించారు. కార్యక్రమం లో అదనపు కలెక్టర్ బీఎస్ లత, ఎస్పీ అశోక్ కుమార్, ఆర్‌అండ్‌బీ అధికారులు, రవాణా, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.