‘ఉపాధి’ లక్ష్యం ఖరారు
ABN , Publish Date - Feb 10 , 2024 | 12:32 AM
గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించి..ఉపాధి కల్పించడంలో భాగంగా రానున్న సంవత్సరానికి ఉపాధి పని దినాల లక్ష్యాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది.
- జిల్లాలో 2024-25లో 38.98 లక్షల పని దినాలు
- ప్రణాళిక సిద్ధం చేసిన గ్రామీణాభివృద్ధి శాఖ
- అభివృద్ధి పనులకే మొగ్గు
- జిల్లాలో 1,55,850 జాబ్ కార్డులు...
జగిత్యాల, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించి..ఉపాధి కల్పించడంలో భాగంగా రానున్న సంవత్సరానికి ఉపాధి పని దినాల లక్ష్యాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. ఇందుకు అనుగుణంగా 2024-25 ఈజీఎస్ లక్ష్య ప్రణాళికను సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా 2024-25లో 38,98,590 పని దినాలు పూర్తి చేయడమే లక్ష్యంగా ఈజీఎస్ అధికారులు సిద్ధమవుతున్నారు. సుమారు 18 ఏళ్ల క్రితం మహాత్మాగాంఽధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపె ట్టింది. రైతులు, కూలీలు ఆర్థికంగా ఎదిగేలా ఈ పథకం ఎంతగానో తోడ్ప డేవిధంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డం పింగ్‌యార్డు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీల పెంపకం, మూగ జీవాలకు షడ్ల నిర్మాణం తదితర పనులను అమలు చేస్తున్నారు. ఇంతటి ప్రాధా న్యం గల పథకాన్ని ఒక ప్రణాళిక ప్రకారం చేపట్టడానికి లక్ష్యాన్ని నిర్దేశిం చారు. గ్రామ స్థాయిలో ప్రజా భాగస్వామ్యంతో సమావేశాలు ఏర్పాటు చే సుకొని గ్రామాభివృద్ధికి ఎలాంటి పనులు చేపట్టాలి.. ఎన్ని పనిదినాలు అ వసరమవుతాయో నిర్ణయించారు. ఇందుకు సంబంధించి 2024-25 సం వత్సరానికి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాలు, గ్రామాల వారి గా పని దినాలను ఖరారు చేశారు.
జిల్లాలో ఈజీఎస్ పరిస్థితి...
జిల్లా వ్యాప్తంగా 8,521 శ్రమ శక్తి సంఘాలున్నాయి. జిల్లాలో 1,55,850 జాబ్ కార్డులు జారీ చేయగా, ఇందులో కూలీల సంఖ్య 2,82,748 మందిగా ఉంది. ప్రతీ యేటా సుమారు లక్ష కుటుంబాలకు ఈజీఎస్ ద్వారా పని కల్పిస్తున్నారు. ప్రతీ యేటా సుమారు రూ. 150 కోట్ల వ్యయాన్ని ఈజీఎస్ పనులకు వెచ్చిస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో ఫాం ఫౌండ్, వార్మిక కాం పోస్ట్ పిట్, మ్యాజిక్ సోక్ ఫిట్స్, డైయింగ్ ఫ్లాట్‌ఫాం, డంపింగ్ యార్డు, కిచెన్ షెడ్, స్కూల్ టాయిలెట్స్, శ్మశాన వాటికలు, సాయిల్డ్ వెస్ట్ మేనేజ్‌మెంట్ కంపోస్ట్ షెడ్, హరితహారం మొక్కల పెంపకం, స్వచ్ఛ భా రత్ మిషన్ తదితర పనులను ఈజీఎస్ కింద నిర్వహిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఈజీఎస్ పని దినాల ప్రణాళిక..
జిల్లా వ్యాప్తంగా 2024-25 సంవత్సరంలో 38,98,590 పని దినాల లక్ష్యా న్ని అధికారులు ఖరారు చేశారు. ఇందులో బీర్‌పూర్ మండలంలో 1,42, 800 పని దినాలు, బుగ్గారంలో 1,57,203, ధర్మపురిలో 2,19,804, గొల్లపల్లి లో 2,64,795, ఇబ్రహీంపట్నంలో 1,97,801, జగిత్యాలలో 18,110, జగిత్యాల రూరల్ మండలంలో 2,12,400 పని దినాలను లక్ష్యంగా నిర్ణయించారు. అ దేవిధంగా కథలాపూర్ మండలంలో 1,93,804 పని దినాలు, కొడిమ్యాల లో 2,86,307, కోరుట్లలో 1,46,800, మల్లాపూర్‌లో 2,28,787, మల్యాలలో 2,51,929, మేడిపల్లిలో 3,07,650, మెట్‌పల్లిలో 1,93,605, పెగడపల్లిలో 2,37,213, రాయికల్‌లో 3,58,158, సారంగపూర్‌లో 1,50,828, వెల్గటూరు మండలంలో 3,30,536 ఈజీఎస్ పని దినాలను లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు.
గ్రామీణులకు వరంలా....
జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి కూలీలు పెరిగే అవకాశం ఉండటంతో అందుకు తగినట్లుగా పని దినాలను పెంచ డంతో పాటు బడ్జెట్‌ను కేటాయించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి అవసరమైన పనులను గుర్తించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులు, అందుకు అవసరమయ్యే కూలీ ల సంఖ్య, కేటాయించాల్సిన నిధులు, అవసరమయ్యే పని దినాలు తదిత ర వాటిని అధికారులు ప్రణాళికబద్ధంగా ఖరారు చేశారు.
అభివృద్ధి పనులకే మొగ్గు....
2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉపాధి పనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ల మార్గదర్శకాల ప్రకారం చేపట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా గ్రామాభివృ ద్ధికి అవసరమైన పనులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎక్కువగా నీటి ని ల్వ పనులను చేపట్టనున్నారు. ముఖ్యంగా గ్రామాభివృద్ధికి అవసరమైన పనులను ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా ఇంకుడు గుంత లు, పశువుల షెడ్ల నిర్మాణం, నీటి తొట్ల ఏర్పాటు, నర్సరీల ఏర్పాటు, నీటి కుంటల నిర్మాణం, హరితహారం మొక్కలకు కంచెల ఏర్పాటు, మొక్కలకు నీరు పోసే పనులు తదితర గ్రామాభివృద్ధికి అవసరమయ్యే పనులను చేపట్టనున్నారు.
పకడ్బందీగా పర్యవేక్షణ...
జిల్లా వ్యాప్తంగా సుమారు 2.82 లక్షల మంది కూలీలు ఉపాధి హామీ పథకంలో నమోదు చేసుకున్నారు. పనులకు వెళ్తున్న కూలీల వివరాలను పని ప్రదేశంలోనే సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్లు రోజు వారీగా నేషనల్ మొ బైల్ మానిటరింగ్ యాప్ ద్వారా నమోదు చేయాల్సి ఉంటుంది. పని ప్ర దేశంలో ఒక్క కూలీ పని చేసినా పని ఫొటో, కూలీ వివరాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సమయాల్లో కూలీ లు, పనుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం ద్వారా ఎలాంటి అ వకతవకలు లేకుండా పనులు పారదర్శకంగా జరపడానికి ప్రయత్నిస్తున్నారు.
వంద శాతం లక్ష్యం పూర్తి చేస్తాం
- పి. నరేశ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
జిల్లాలో రానున్న 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద కూలీలకు కల్పించాల్సిన పని దినాల ప్రణాళికను ఖరారు చేశారు. లక్ష్యం మేరకు వంద శాతం పని దినాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నా ము. గ్రామీణ ప్రాంతాల్లో అవసరమయ్యే పనులను గ్రామ సభల ద్వారా నిర్ణయించి పూర్తి చేస్తాము. ప్రభుత్వ లక్ష్యం మేరకు కూలీలకు పనులు కల్పించనున్నాము.