జిల్లాలో స్వల్పంగా కంపించిన భూమి
ABN , Publish Date - Dec 05 , 2024 | 01:36 AM
పెద్దపల్లి జిల్లాలో బుఽధవారం ఉదయం 7 గంటల 23 నిమిషాల కు 5 సెకండ్ల పాటు స్వల్పంగా భూకంపం సంభవించిం ది.
పెద్దపల్లి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : పెద్దపల్లి జిల్లాలో బుఽధవారం ఉదయం 7 గంటల 23 నిమిషాల కు 5 సెకండ్ల పాటు స్వల్పంగా భూకంపం సంభవించిం ది. రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ప్రధానంగా ఈ భూకంపం రాగా దాని ప్రభావం 18.44 కిలోమీటర్ల నుండి 80.84 కిలోమీటర్ల వరకు ఉంది. 40కిలో మీటర్ల లోతులో ఈ భూకంపం సంభంవించింది. రిక్టర్ స్కేల్ పై 5.3 గా నమోదు అయ్యింది. ఎక్కడ కూడ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
సుల్తానాబాద్(ఆంధ్రజ్యోతి) : సుల్తానాబాద్ పట్టణంతో పాటు పలు గ్రామాల్లో భూమి కంపించింది. ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల ప్రాంతంలో భూమి ఇళ్లలో సామాన్లు కింద పడ్డాయి. వంట గదుల్లో పాత్రలు కిందపడ్డాయి. దీంతో భయంతో ఇళ్లనుంచి బయటకు పరిగెత్తారు.
కోల్‌సిటీ (ఆంధ్రజ్యోతి): రామగుండం పారిశ్రామి క ప్రాంతంలో బుధవారం ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఉదయం 7.25గంటల నుంచి 7.27గంటల మధ్య భూమి కంపించింది. గోదావరి పరి వాహక ప్రాంతంలో ఈ ప్రకంపనలు ఎక్కువగా ఉన్నా యి. ముఖ్యంగా సింగరేణి ఓపెన్‌కాస్టుల్లో కార్మికులు ఈ ప్రకంపనలు గుర్తించారు. సాధా రణంగా ఓపెన్‌కాస్టుల్లో మధ్యా హ్నం తరువాత బ్లాస్టింగ్‌లు ఉంటాయి. ఉదయ మే భూమి కంపించడంతో ఆందోళనకు గుర య్యారు. సింగరేణి గనులపై కా ర్మికులు సైతం అండర్ గ్రౌండ్ లోకి వెళ్లేందుకు కొంత తటపటా యించారు. సింగరేణి ఉన్నతా ధికారులు ఎప్పటికప్పుడు పరిస్థి తులను ఆరా తీశారు. కొన్ని గనుల్లో అరగంట ఆలస్యంగా కార్మికులు విధులకు హాజర య్యారు. ఇరిగేషన్ శాఖ అధికా రులు కూడా పరిస్థితుల గురించి వాకబు చేశారు. రామ గుండం పారిశ్రామిక ప్రాంతంలోని రేకుల షెడ్లు ఉన్న ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా గుర్తించినట్టు ప్రజలు పేర్కొంటున్నారు. కొన్ని చోట్ల ఇంటి సామగ్రి కిందపడిపోయింది.