బిరుదు రాజమల్లు ఆశయాల సాధనకు కృషి
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:20 AM
మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు ఆశయాల సాధన కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు.
సుల్తానాబాద్, అక్టోబర్ 1: మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు ఆశయాల సాధన కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. రాజమల్లు జయంతిని పురస్కరించుకుని సుల్తానాబాద్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మున్సిపల్ కార్మికు లకు నూతన వస్త్రాలను బిరుదు కుటుంబ సభ్యులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిరుదు రాజమల్లు సుధీర్ఘ కాలం పాటు ప్రజల కు సేవలందించారని, పూసాల రోడ్డులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి త్వరలోనే ఆవిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాజమల్లు సతీమణి సుశీల, కుటుంబ సభ్యులతో పాటు మున్సిపల్ చైర్‌పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, వైస్ చైర్‌పర్సన్ బిరుదు సమత క్రిష్ణ, మాజీ జడ్పీటీసీ మినుపాల స్వరూప ప్రకాష్‌రావు, మాజీ సర్పంచ్ అంతటి అన్నయ్యగౌడ్, కేడీసీసీబీ డైరక్టర్ శ్రీగిరి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయిరి మహేందర్, పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఈర్ల స్వరూప, నాయకులు అబ్బయ్యగౌడ్, చిలుక సతీష్, రాజయ్య, రాజలింగం, రాజు, రఫీ, కుమార్ కిషోర్, మోబిన్ తదితరులు పాల్గొన్నారు.