నేడు గణనాథుల నిమజ్జనం
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:26 AM
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సోమవారం గణేష్‌నిమజ్జనం జరుగనున్నది.
కోల్‌సిటీ, సెప్టెంబరు 15: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సోమవారం గణేష్‌నిమజ్జనం జరుగనున్నది. గణపతి నిమజ్జనానికి సింగరేణి, మున్సిపల్ ఆధ్వ ర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ నవరాత్రులకు ముందుగానే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సింగరేణి, ఎన్‌టీ పీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, పోలీస్, వివిధ ప్రభుత్వశాఖల అధికారులతో సమన్వయ సమా వేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిమజ్జనానికి ఇబ్బంబదులు కలుగకుండా శాఖలవారీగా పనుల విభజన చేశారు. ఇందుకు అనుగుణంగా సింగరేణి, నగర పాలక సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథు లను సోమవారం గోదావరి వంతెన నుంచి నిమజ్జనం చేయనున్నారు. ఈ మేరకు గోదావరి వంతెన వద్ద వేదికలు ఏర్పాటు చేశారు. ఈ ప్లాట్‌ఫాంల నుంచి గోదావరి లో గణనాథులను నిమజ్జనం చేస్తారు. మొదట 20ప్లాట్‌ఫాంలను ఏర్పాటు చేయాల ని నిర్ణయించినా గోదావరిలో ప్రవాహం తక్కువగా ఉండడంతో 16 ప్లాట్‌ఫాంలను ఏర్పాటు చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి 14వేల క్యూసెక్కుల నీటిని కిం దకు వదిలారు. గత ఏడాది 580 గణనాథులను ప్రతిష్టింగా ఈ సారి 600గణనాథు లను ప్రతిష్టించారు. శోభయాత్ర దృష్ట్యా మున్సిపల్, సింగరేణిలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. శోభయాత్ర జరిగే ప్రాంతాల్లోని రోడ్ల గుంతలను పూడ్చారు. సింగరేణి సం స్థ వివిధ కూడళ్లకు సీరిస్ లైట్లను అమర్చించింది. గోదావరిఖని మెయిన్‌చౌరస్తాలో గణనాథులకు స్వాగతం పలుకనున్నాయి. మెయిన్ చౌరస్తాలోనే 300లైట్లతో లైటింగ్ ఏర్పాటుచేశారు. విద్యుత్ అంతరాయం కలుగకుండా ఎక్స్‌ప్రెస్‌లైన్లను అమర్చారు. అనివార్య పరిస్థితులు ఏర్పడితే ఇబ్బంది కలుగకుండా 60కేవీఏ జనరేటర్ ఏర్పాటు చేశారు. గోదావరి వంతెన వద్ద లైటింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఎక్స్‌ప్రెస్ లైన్ ఏర్పాటుచేయడంతో పాటు 60కేవీఏ జనరేటర్‌ను ఏర్పాటు చేశారు. రామగుం డం పారిశ్రామిక ప్రాంతంతో పాటు శ్రీరాంపూర్, మందమర్రి, రామకృష్ణాపూర్ ప్రాం తాల నుంచి కూడా గణనాథులు వచ్చే అవకాశం ఉండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టారు. మంగళవారం తెల్లవారు వరకు నిమజ్జనం జరిగే అవకాశం ఉంది.