బాధితులు, ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి
ABN , Publish Date - Nov 10 , 2024 | 12:51 AM
బాధితులు, ఫిర్యాదుదారులతో మర్యా దగా ప్రవర్తించాలని రామ గుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు.
ముత్తారం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : బాధితులు, ఫిర్యాదుదారులతో మర్యా దగా ప్రవర్తించాలని రామ గుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు. ముత్తారం పోలీస్ స్టేషన్‌ను ఆయన శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల ఫిర్యాదుల విష యంలో వెంటనే స్పందింది విచారణ చేపట్టి బాధితుల కు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. సిబ్బంది పనితీరు, నమోదు చేయబడిన కేసుల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్, ప్రజలతో, ఫిర్యాదుదారులతో ఎలా ప్రవర్తిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. రికార్డులను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న నేరాలు, తదితర అంశాలను ఎస్‌ఐని అడిగి తెలుసుకున్నారు. 2023 సంవత్సరానికి ముందు నమోదై పెండింగ్‌లో ఉన్న కేసుల ను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ సంబం ధించిన సమస్యలు, ప్రమాదాలు జరిగే ప్రాంతాలు గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నేను సైతంలో భాగంగా ప్రజల, వ్యాపారస్థుల, ప్రజాప్రతినిధుల సమన్వయంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు, ఫిర్యాదు లు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్క రించాలన్నారు. గంజాయి,మత్తు పదార్థాల సరఫరా, విక్ర యం, అక్రమ రవాణా, సేవించడం వంటి వాటిపై, అసాం ఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని సూచిం చారు. రోడ్డు ప్రమాద కేసులను పెండింగ్‌లో ఉంచకూడద ని సూచించారు. ఈ కార్యక్రమంలో మంథని సీఐ రాజు, ఎస్సై నరేష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.