Share News

అసౌకర్యంగా వసతి గృహాలు

ABN , Publish Date - Dec 22 , 2024 | 02:36 AM

జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ హాస్టళ్లపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అసౌకర్యాలు రాజ్యమేలుతున్నాయి. పరిసరాలు పరిశుభ్రంగా లేక విద్యార్థులు జ్వరాలబారిన పడుతున్నారు. పలు వసతిగృహాల విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయక చలికి గజగజ వణుకుతున్నారు.

అసౌకర్యంగా వసతి గృహాలు

- సరిపడా బాత్‌రూంలు, మరుగుదొడ్లు లేవు

- కొన్నింటిలో బెడ్లు, పరుపులు లేక నేలమీదే నిద్ర

- కొన్ని హాస్టళ్లకు దుప్పట్లు పంపిణీ లేక చలికి గజగజ

- అధికారులు, వార్డెన్ల పర్యవేక్షణ కరువు

- జిల్లాలో హాస్టళ్లపై ‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ హాస్టళ్లపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అసౌకర్యాలు రాజ్యమేలుతున్నాయి. పరిసరాలు పరిశుభ్రంగా లేక విద్యార్థులు జ్వరాలబారిన పడుతున్నారు. పలు వసతిగృహాల విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయక చలికి గజగజ వణుకుతున్నారు. ఇళ్ల నుంచి తెచ్చుకున్న దుప్పట్లనే వాడుతున్నారు. కొన్ని వసతి గృహాలకు తలుపులు సరిగా లేక, కిటికీల తలుపులు లేక అట్టలు, బట్టలు అడ్డుగా పెట్టి చలి నుంచి రక్షణ పొందుతున్నారు. కొన్నింటిలో సరిపడా బెడ్లు లేక నేలపైనే నిద్రిస్తున్నారు. చాలా వసతి గృహాల్లో డైనింగ్‌ టేబుళ్లు లేక కిందనే కూర్చుని భోజనాలు చేస్తున్నారు. హాస్టల్‌ పరిసరాలు, కిచెన్‌లను అపరిశుభ్రంగా ఉంటున్నాయి. మెనూ ప్రకారమే భోజనాలు పెడుతున్నప్పటికీ, వసతుల విషయంలోనే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్‌, జూలపల్లి, ధర్మారం, కాల్వశ్రీరాంపూర్‌, ఓదెల, కమాన్‌పూర్‌, మంథని, గోదావరిఖని, రామగుండం, పాలకుర్తి మండలాల్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 11 ప్రీమెట్రిక్‌ హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో 7 బాలుర, 4 బాలికల హాస్టళ్లు ఉన్నాయి. పోస్టుమెట్రిక్‌ హాస్టళ్లు 6 ఉండగా, ఇందులో 4 బాలుర, 2 బాలికల హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో 840 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రీమెట్రిక్‌ హాస్టళ్లు 6 ఉండగా, ఇందులో 4 బాలురు, 2 బాలికల హాస్టళ్లున్నాయి. పోస్టు మెట్రిక్‌ హాస్టళ్లు 8 ఉండగా, 14 హాస్టళ్లు ఉండగా ఇందులో 4 బాలురు, 4 బాలికల హాస్టళ్లున్నాయి. వీటిలో 1466 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం, రాత్రి వేళలో రెండు దఫాలుగా జిల్లాలో గల వసతిగృహాలను ‘ఆంధ్రజ్యోతి’ బృందం విజిట్‌ చేయగా పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 31 హాస్టళ్లకు పదింటికి సొంత భవనాలు లేక, సొంత భనవాలకు మరమ్మతులు లేక అసౌకర్యంగా మారాయి.

అసౌకర్యాలతో సహవాసం..

సుల్తానాబాద్‌లోని బీసీ హాస్టల్‌లో బాతురూములకు డోర్లు సరిగా లేక, బెడ్లు ఉన్నా పరుపులు లేక కిందనే పడుకుంటూ చలికి ఇబ్బందులు పడుతున్నారు. ఎస్సా బాలుర కళాశాల హాస్టల్‌ అధ్వానంగా ఉంది. గదులు, కిటీకిలు సరిగా లేవు. చెదలు పట్టడంతో నేల రంద్రాలు పడడంతో విష పురుగులతో ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు 8 ఉంటే 6 మాత్రమే వినియోగంలో ఉన్నాయి. కాల్వశ్రీరాం పూర్‌లోని ఎస్సీ బాలుర హాస్టల్‌ విద్యా ర్థులకు దుప్పట్లు, స్వెటర్లు పంపిణీ చేసినా బాత్‌రూముల డోర్లు సరిగా అవస్థలు పడుతున్నారు. గోదావరిఖని లోని ఎస్సీ బాలుర హాస్టల్‌లో సరిపడా బాత్‌రూంలు, మరుగుదొడ్లు లేవు, బీసీ బాలుర హాస్టల్‌లో బాతురూములకు తలుపులు సక్రమంగా లేవు. బీసీ బాలి కల హాస్టల్‌లోని కొన్ని కిటికీలకు తలుపు లు విరిగి పోయి ఉండడంతో విద్యార్థు లకు ఇబ్బందులు తప్పడం లేదు. ఓదెల లో బీసీ బాలికల హాస్టల్‌ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయకపోవడంతో ఇళ్ల నుంచి తెచ్చుకున్నారు. అవి సరి పోక చలికి గజగజ వణుకుతున్నారు. బాలుర హాస్టల్‌లో బెడ్లు లేక కిందనే నిద్రిస్తున్నారు. డైనింగ్‌ కూడా సరిగా లేదు. పాలకుర్తి మండలం జయ్యారం హాస్టల్‌లో డైనింగ్‌ టేబుళ్లు బయట వేశారు. జూలిపల్లి బీసీ బాలికల హాస్టల్‌ లో విద్యార్థుకు బెడ్లు లేక విద్యార్థులు నేల మీదనే నిద్రిస్తున్నారు. ధర్మారం మండలం నందిమేడారం ఎస్సీ బాలుర హాస్టల్‌లో కిటికీల తలుపులు విరిగిపోవ డంతో ఇక్కట్లు పడుతున్నారు. మంథని లలోని పలు హాస్టళ్లలో మరుగుదొడ్లు సక్రమంగా లేక, కిటికీలకు తలుపులు సరిగ్గా లేకపోవడం, పరిసరాలు, కిచెన్లు అపరిశుభ్రంగా ఉన్న కారణంగా విద్యా ర్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. హాస్టళ్లపై అధికారుల పర్యవేక్షణ లేకపో వడం, వార్డెన్లు రెగ్యులర్‌ రావడంతో అవస్థలు పడుతున్నారు. మొత్తం 31 హాస్టళ్లకు పదింటికి సొంత భవనాలు లేక, సొంత భనవాల కు మరమ్మతులు లేక అసౌకర్యంగా మారాయి.

Updated Date - Dec 22 , 2024 | 02:37 AM