యాసంగి పంటల ప్రణాళికపై అవగాహన
ABN , Publish Date - Nov 08 , 2024 | 12:21 AM
యాసంగి పంటల సాగు ప్రణాళికపై కొత్తపల్లి మండలంలోని బద్దిపల్లి రైతు వేదికలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం, కరీంనగర్ వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో దత్తత గ్రామమైన కొత్తపల్లి మండలంలోని నాగుల మల్యాల రైతులకు అవగాహన కల్పించారు.
భగత్‌నగర్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): యాసంగి పంటల సాగు ప్రణాళికపై కొత్తపల్లి మండలంలోని బద్దిపల్లి రైతు వేదికలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం, కరీంనగర్ వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో దత్తత గ్రామమైన కొత్తపల్లి మండలంలోని నాగుల మల్యాల రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దత్తత గ్రామ ఇన్‌చార్జి డాక్టర్ పి మఽధుకర్‌రావు మాట్లాడుతూ ఆరు తడి పంటల యాజమాన్య పద్ధతులను వివరించారు. డాక్టర్ జి ఉషారాణి మాట్లాడుతూ ఆరు తడిపంటల రకరాలు, సాగు వివరాలు తెలియజేశారు. వ్యవసాయ పరిశోధన స్థానం, మొక్కజొన్న పరిశోధన స్థానం హైదరాబాద్ ఆధ్వర్యంలో మొక్క జొన్నచిరు సంచులను రైతులకు అందించారు. అనంతరం ఉప్పు కనుకయ్య, మిట్ట లక్ష్యయ్య సాగు చేసిన మొక్కజొన్న, వరి పంటలను పరిశీలించారు. కార్యక్రమంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేంద్రప్రసాద్, సమన్వయకర్త డాక్టర్ కె మదన్‌మోహన్‌రెడ్డి, సీనియర్ శాస్త్రవేత్తలు, మండల వ్యవసాయాధికారి ఎం కృష్ణ ఏఈవో తిరుపతి పాల్గొన్నారు.