Share News

కలెక్టర్‌కు యూనిసెఫ్‌ ప్రశంస

ABN , Publish Date - Dec 27 , 2024 | 11:44 PM

జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలకు నాంది పలుకుతున్న ్ల కలెక్టర్‌ పమేలా సత్పతిని యూనిసెఫ్‌ ప్రశంసించింది. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్‌కు యూనిసెఫ్‌ రాష్ట్ర వాష్‌ స్పెషలిస్టు వెంకటేశ్‌ ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

కలెక్టర్‌కు యూనిసెఫ్‌ ప్రశంస
కలెక్టర్‌ పమేలా సత్పతికి ప్రశంసా పత్రం అందజేస్తున్న యూనిసెఫ్‌ ప్రతినిధి

కరీంనగర్‌ టౌన్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలకు నాంది పలుకుతున్న ్ల కలెక్టర్‌ పమేలా సత్పతిని యూనిసెఫ్‌ ప్రశంసించింది. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్‌కు యూనిసెఫ్‌ రాష్ట్ర వాష్‌ స్పెషలిస్టు వెంకటేశ్‌ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. కలెక్టర్‌ పమేలా సత్పతి పారిశుధ్య కార్మికుల రక్షణ పలు చర్యలు తీసుకున్నారు. కార్మికులకు బీమా సౌకర్యం, ఆరోగ్య పరీక్ష కార్డుల పంపిణీ, పని చేస్తున్నప్పుడు ధరించేందు రక్షణ కవచాలు అందజేశారు. కార్మికులకు కావాల్సిన సౌకర్యాలపై కలెక్టర్‌ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని యూనిసెఫ్‌ మూడు రాష్ర్టాల చీఫ్‌ జిలాలెమ్‌ బి టఫస్సీ ప్రశంసించారు. కార్యక్రమంలో యూనిసెఫ్‌ రాష్ట్ర కన్సల్టెంట్‌ ఫణీంద్ర కుమార్‌, జిల్లా సమన్వయకర్త కిషన్‌ స్వామి, స్వచ్ఛ భారత్‌ జిల్లా సమన్వయకర్తలు రమేష్‌, వేణుప్రసాద్‌, క్లస్టర్‌ ఫెసిలిటేటర్లు కళ్యాణి, రవీందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 11:44 PM