Share News

అకాల వర్షం.. తడిసిన ధాన్యం..

ABN , Publish Date - May 08 , 2024 | 12:06 AM

మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఉదయం నుంచి చిరు జల్లులతో మొదలైన ఉరుములు, మెరుపులు ఆకాశం మేఘావృతమై మధ్యా హ్నం, సాయంత్రం భారీ వర్షం కురిసింది.

అకాల వర్షం.. తడిసిన ధాన్యం..

ఎలిగేడు, మే 7 : మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఉదయం నుంచి చిరు జల్లులతో మొదలైన ఉరుములు, మెరుపులు ఆకాశం మేఘావృతమై మధ్యా హ్నం, సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఎంతో వేడిమి తట్టుకొని ఒకేసారి వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రైతులు పండించిన పంట కొనుగోలు కేంద్రాల్లోనే మగుతోంది. ఒకేసారి వర్షం తీవ్రమైన గాలి వీచడంతో వడ్లు తడిసిపోయి టార్పాలిన్లు కొటుకుపోవడంతో రైతులు అసహ నానికి గురయ్యారు. వారం రోజులు వర్షం పడకుంటే వడ్లు అమ్ము కునే వారమని రైతులు పేర్కొన్నారు. ఇంకా వర్షం ఎక్కువ పడి వడ్లు తడిస్తే ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

సుల్తానాబాద్‌ : సుల్తానాబాద్‌తోపాటు మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఉదయం,సాయంత్రం భారీ వర్షం కురిసిం ది. ఉదయం ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురువగా సాయంత్రం ఒక్కసారిగా తుఫాను వేగంతో వీచిన గాలులతో కూడి న భారీ వర్షం పడింది. రోడ్లపై వరద పారింది. కొన్ని రోజుల నుంచి ఎండల తీవ్రతతో, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించగా, రైతులకు మాత్రం కొంత నష్టాన్ని కలిగించింది. మండలంలోని సుద్దాల, కదంబాపూర్‌, రేగడి మద్దికుంట, కనుకుల, రామునిపల్లి తదితర గ్రామాల్లో మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. కొనుగోలు కేంద్రాలలో అక్కడక్కడా ఉన్న ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. ఉదయం వాతావరణం చూసి రైతులు ముందు జాగ్రత్తగా ధాన్యం కుప్పలపై కవర్లను కప్పుకున్నారు. దీంతో కొంత నష్టం జరగకుండా కాపాడుకున్నారు.

పాలకుర్తి : మండలం పరిధిలో మంగళవారం సాయంత్రం భారీ ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన అకాల వర్షానికి రైతులు ఆగమాగం అయ్యారు. వివిధ గ్రామాల్లోని రైతులు కల్లాల వద్ద ఆరబోసిన ధాన్యం తడుస్తుందని రైతులు ఉరుకులు, పరుగు లతో కవర్లు తెచ్చి కప్పి ధాన్యాన్ని కాపాడుకున్నారు. పుట్నూర్‌ సబ్‌ స్టేషన్‌ పరిధిలో విద్యుత్‌ తీగెలపై చెట్టు మండలు విరిగి పడడంతో విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. గమనించిన అధికారులు అప్రమ త్తమై మరమ్మతులు చేపట్టి విద్యుత్‌ పునరుద్ధరించారు.

ధర్మారం : మండలంలో మంగళవారం కురిసిన వర్షానికి కొను గోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం తడిసింది. ఎర్రగుంటపల్లి, ధర్మా రం వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షానికి ధాన్యం తడిసి పోవడంతో వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని పలు వురు కోరుతున్నారు.

పెద్దపల్లి రూరల్‌ : పెద్దపల్లి మండలంలో పలు గ్రామాల్లో మంగ ళవారం ఈదురుగాలులతో పాటు వడగండ్ల వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేం దుకు సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసి ముద్దయ్యాయి. నిట్టూరులో నిర్మించిన శ్మశానవాటికపై కప్పు ఈదురుగాలులకు కొట్టుకుపోగా, తాటిచెట్టు నేలవాలింది. కొత్తపల్లిలో కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం ఆరబోసిన ప్రాంతంలో వర్షపు నీరు నిలిచి పూర్తిగా తడిసి పోయింది. హన్మంతునిపేట, పెద్దకల్వల, రాంపల్లి, బొంపల్లి, నిమ్మన పల్లి గ్రామాల్లో వడగండ్ల వర్షం కురిసింది. దీంతోపాటు పలు ప్రాం తాల్లో ధాన్యం తడిసిముద్దయిందని, తడిసిన ధాన్యంను కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

కాల్వశ్రీరాంపూర్‌ : మండలంలో కురిసిన భారీ వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. రైతులు పరదాల కోసం ఇంటివైపు పరుగులు తీశారు. పరదాలు తీసుకవచ్చేలోపే భారీ వర్షం కురువడంతో పలు గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోయింది. దీంతో రైతన్నలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

మంథని : వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కార ణంగా మంథని డివిజన్‌లోని మంథని, ముత్తారం, రామగిరి, కమా న్‌పూర్‌ మండలాల్లోని ఆయా గ్రామాల్లో మంగళవారం గాలి దుమా రంతో పాటు స్వల్పంగా వర్షం కురిసింది. ఒక్కసారిగా గాలి దుమా రం పెద్దఎత్తున రావడంతో పాటు ఇదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఆయా గ్రామాల్లోని వరి పొలాల్లోని వరి ధాన్యం కుప్పలు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కుప్పలు స్వల్పంగా తడిచి పోయాయి. రైతులు వెంటవెంటనే అప్రమత్తంగా ధాన్యం కుప్పలు తడవకుండా టార్ఫాలిన్లు కప్పుకొని జాగ్రత్తపడ్డారు.

నేలరాలిన మామిడికాయలు..

కాగా, గాలిదుమారంతో పలు గ్రామాల్లో మామిడి తోటల్లోని కా యలు రాలి కిందపడ్డాయి. దీంతో రైతులకు స్వల్పంగా నష్టం వాటి ల్లింది. పక్షం రోజులుగా ఎండ వేడిమితో అల్లాడిన జనానికి చల్లబడ్డ వాతావరణం ఉపశమనాన్ని ఇచ్చింది.

Updated Date - May 08 , 2024 | 12:06 AM