Share News

మంథనిలో ఉత్తరప్రదేశ్‌ పరిస్థితులు

ABN , Publish Date - May 31 , 2024 | 12:34 AM

మంథని ప్రాంతాన్ని మరో ఉత్తరప్రదేశ్‌గా మార్చేందుకు అన్న దమ్ములు కృషి చేస్తున్నారని జడ్‌పీ చైర్మన్‌ పుట్ట మధు ఆరోపించారు.

మంథనిలో ఉత్తరప్రదేశ్‌ పరిస్థితులు

రామగిరి, మే 30: మంథని ప్రాంతాన్ని మరో ఉత్తరప్రదేశ్‌గా మార్చేందుకు అన్న దమ్ములు కృషి చేస్తున్నారని జడ్‌పీ చైర్మన్‌ పుట్ట మధు ఆరోపించారు. మండలంలోని నాగేపల్లిలో ఇటీవల రాత్రి వ్యాపార సంస్థ షటర్స్‌ కూల్చివేత స్థలాన్ని ఆయన పరిశీ లించారు. అనంతరం జడ్‌పీ చైర్మన్‌ మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్‌లో రౌడీలు, మాఫి యాలకు సంబంధించిన గృహాలు ఉదయం కూల్చివేతకు గురి అవుతుండగా మంథ ని, నాగేపల్లి ప్రాంతంలో రాత్రి కూల్చివేత చేపడుతున్నారని ఆరోపించారు. ఇటీవల ఎన్నికల ఖర్చుల రికవరీ కోసం ఎమ్మెల్యే హైదరాబాద్‌లో దందా కొనసాగిస్తుంటే, తమ్ముడు మంథని నియోజకవర్గంలో ఇసుక, మట్టి దందాల నిర్వాహకులను భయ భ్రాంతులకు గురి చేస్తూ వసూళ్ళకు పాల్పడుతున్నాడని విమర్శించారు. పది సంవ త్సరాల కాలంలో బీసీ బిడ్డగా ఎవరి ఇంటి గద్దెను సైతం కూల్చలేదన్నారు. దేశంలో రాహుల్‌ గాంధీ అంబేద్కర్‌ ఆశయాలు పట్టుకొని ప్రసంగాలు చేస్తుంటే, ఇక్కడే రాజ్యాంగ విరుద్ధంగా పేద బీసీ బిడ్డల షటర్స్‌ కూల్చివేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు తమ పరిధులు దాటి ప్రవర్తిస్తున్నారని, ఈ వ్యవహారం మంచిది కాద న్నారు. లద్నాపూర్‌ చాలా మంది నిర్వాసితులు ఆర్‌అండ్‌ఆర్‌ రాక బాధపడుతున్నార ని, వారి సమస్య పరిష్కరించే దిశగా మంత్రి ఆలోచన చేయాలన్నారు. ఓటు వేసే ముందుకు బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీలు ఆలోచించి వేయాలన్నారు. షటర్స్‌ కూల్చివేతపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పూదరి సత్యనారాయణగౌడ్‌, కాపురబోయిన భాస్కర్‌, దామోర శ్రీనివాస్‌, ఓదేలు, ప్రభాకర్‌, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2024 | 12:34 AM